LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

High Court: సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు ఆగ్రహం.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

AP High Court: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, ప్లెక్సీల వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది..

AndhraPravasi News Desk 1 min read
High Court: సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు ఆగ్రహం.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

ఒక సీఎంను అవమానించడం అంటే కోట్లాది ప్రజలను అవమానించడం కాదా? 

చట్టం, కోర్టులంటే భయం కలిగేలా పోలీసుల చర్యలు ఉండాలి.. 

సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, ప్లెక్సీల వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వాదనలు పూర్తయ్యాక ఈ కేసులో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

విచారణలో భాగంగా, “2029లో మీరు చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం” అనే వ్యాఖ్యలతో ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. “ఇలాంటి ప్లెక్సీలు పెట్టడానికి ఎంత ధైర్యం ఉండాలి? ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్నా? లేక రాష్ట్ర ప్రజలనా?” అంటూ ప్రశ్నించింది.

అలాగే, ముఖ్యమంత్రిని అవమానించడం అంటే రాష్ట్ర ప్రజల భావాలను దెబ్బతీయడమేనని కోర్టు స్పష్టం చేసింది. “ఒక సీఎంను అవమానించడం అంటే కోట్లాది ప్రజలను అవమానించడం కాదా?” అని ప్రశ్నిస్తూ, వ్యక్తిగతంగా మరియు కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించింది.

“అవమానించేలా మాట్లాడే హక్కు, పోస్టులు పెట్టే అధికారం ఎవరిచ్చారు? వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు” అంటూ హైకోర్టు కఠినంగా వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంలో పోలీసుల పనితీరుపైనా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితులు మళ్లీ రావని పేర్కొంది. “చట్టం, కోర్టులంటే భయం కలిగేలా పోలీసుల చర్యలు ఉండాలి. పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే 2024 తర్వాత కూడా ఇలాంటి పోస్టులు పెట్టే ధైర్యం వచ్చేదే కాదు” అని కోర్టు వ్యాఖ్యానించింది.

అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టుల కేసులను డీల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో అన్ని వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పును హైకోర్టు త్వరలో వెలువరించనుంది.

అలాగే, సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన వ్యవహారం అవసరమని, వ్యక్తిగత అవమానాలు, దూషణలు సహించబోమని హైకోర్టు స్పష్టమైన సందేశం ఇచ్చింది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…