LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Amaravathi: అమరావతికి శాశ్వత చట్టబద్ధత! రాష్ట్రపతి సంతకంతో చారిత్రాత్మక ఘట్టం!

Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే సంఘటనగా మారింది.

AndhraPravasi News Desk 1 min read
Amaravathi: అమరావతికి శాశ్వత చట్టబద్ధత! రాష్ట్రపతి సంతకంతో చారిత్రాత్మక ఘట్టం!

రైతుల త్యాగం… అమరావతికి బలమైన పునాది..

అభివృద్ధి దిశగా అమరావతి..

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే సంఘటనగా మారింది. ఐదుకోట్ల ఆంధ్రుల కల అయిన అమరావతికి శాశ్వతత్వం కల్పించిన ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. “మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – మా రాజధాని అమరావతి” అని గర్వంగా చెప్పుకునేలా చేసిన ఈ నిర్ణయం కోసం ఐదుకోట్ల ఆంధ్రుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి లోకేష్ మాట్లాడుతూ, అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని, 2024లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని రాష్ట్రపతికి వివరించారు. అమరావతి చరిత్ర, సంస్కృతి, ఇప్పటికే పూర్తైన నిర్మాణాలు, భవిష్యత్తు మాస్టర్ ప్లాన్, పర్యావరణహిత ప్రణాళికలతో రూపొందించిన పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు.

అమరావతి నిర్మాణం వెనుక రైతుల త్యాగం ఎంతో గొప్పదని లోకేష్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ఎన్నో ఇబ్బందులు, కేసులు ఎదురైనా రైతులు శాంతియుతంగా తమ ఉద్యమాన్ని కొనసాగించారని చెప్పారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రైతుల త్యాగాలను ప్రశంసించారు. రాష్ట్రంపై ప్రేమతో భూములు ఇచ్చిన రైతులు నిజమైన భాగస్వాములని అభినందించారు. “పోరాడి సాధించుకున్నది ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని ఆమె పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఆయన దూరదృష్టితో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని, రాజధాని పనులు అడ్డంకులు లేకుండా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ పరిణామంతో అమరావతి రాజధాని నిర్మాణానికి మరింత బలం చేకూరగా, ఆంధ్రుల కల నిజమవుతుందనే నమ్మకం ప్రజల్లో మరింత పెరిగింది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…