LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

YSRCP Shock: బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి వరుస షాక్ లు.. టీడీపీలోకి భారీగా చేరికలు..

YSRCP Shock in Banaganapalle: కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన సుపరిపాలన వైసీపీ క్యాడర్ ను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షిస్తుంది.. గత కొద్ది కాలంగా బనగానపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేతలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో త…

AndhraPravasi News Desk 2 min read
YSRCP Shock: బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి వరుస షాక్ లు.. టీడీపీలోకి భారీగా చేరికలు..
  • నిన్న పార్టీలో చేరిన పలుకూరు వైసిపి నేతలు.. నేడు అదే బాటలో ఎనకండ్ల గ్రామ వైసీపీ క్యాడర్..
     
  • చంద్రబాబు నాయకత్వంలో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధితో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్..
     
  • రాష్ట్రంలోనే బనగానపల్లెను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న మంత్రి..

YSRCP Shock in Banaganapalle: కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన సుపరిపాలన వైసీపీ క్యాడర్ ను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షిస్తుంది.. గత కొద్ది కాలంగా బనగానపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేతలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు.. నిన్న పలుకూరు గ్రామానికి చెందిన వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తాజాగా నేడు ఎనకండ్ల గ్రామానికి చెందిన స్థానిక వైసీపీ నేతలు టీడీపీలో చేరడం జరిగింది..

నేడు బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఎనకండ్ల గ్రామ వైసిపి నేతలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది.. ఈ సందర్భంగా కోడూరు రామచంద్రారెడ్డి, బీసీ మద్దిలేటి రెడ్డి, కృష్ణారెడ్డి, పాపసాని గోపాల్ రెడ్డి, కోడూరు వెంకట సుబ్బారెడ్డి, ఆర్ రామేశ్వరరెడ్డి, బీసీ మధుసూధన్ రెడ్డి తదితరులకు తెలుగుదేశం జెండాను కప్పి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..

నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి నచ్చి తాము తెలుగుదేశం పార్టీలోకి రావడానికి జరిగిందని నూతనంగా చేరిన నేతలు తెలిపారు.. ముఖ్యంగా గత 20 నెలల పాలనలో బనగానపల్లెలో కనివిని రీతిలో అభివృద్ధి జరుగుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.. బనగానపల్లె ను రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేస్తున్న కృషి, తపన నచ్చి తామంతా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందన్నారు..

తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని గుర్తించి తమతో కలిసి నడవడానికి ముందుకు వచ్చిన నేతలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభినందనలు తెలిపారు.. కొత్తగా పార్టీలో చేరిన నేతలు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా ఏకతాటి పైకి వచ్చి తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలన్నారు.. కొత్తగా పార్టీలో చేరిన నేతలను కలుపుకొని ముందుకు సాగాలని పార్టీ సీనియర్ నేతలకు మంత్రి సూచించారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…