LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Irrigation: ఉత్తరాంధ్రలో 11 కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులు.. రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యం!

Irrigation: ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలకమైన 11 ఇరిగేషన్ ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సుమారు రూ.2000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

AndhraPravasi News Desk 2 min read
Irrigation: ఉత్తరాంధ్రలో 11 కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులు.. రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యం!

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడమే లక్ష్యం..

ఉత్తరాంధ్రప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష..

విజయవాడ: ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలకమైన 11 ఇరిగేషన్ ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సుమారు రూ.2000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ 11 ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తరాంధ్రలో సుమారు 2.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందని, మరో 2.49 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని మంత్రి వివరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాన్ని సాగులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కరువుప్రాంతాలకు ఉపయోగపడే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

వంశధార ట్రిబ్యునల్ 2021 తీర్పును గెజిట్‌లో చేర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఎంతో కీలకమని మంత్రి ప్రశంసించారు. ఢిల్లీకి పలుమార్లు వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో చర్చలు జరిపి ఒడిశాతో ఉన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా కృషి చేసినట్లు చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ రావడంతో శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని ఆనందం వ్యక్తం చేశారు.

గత ఐదేళ్లలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని వైసీపీ ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, అలాగే పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను గత ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఉత్తరాంధ్ర సీఈ, ఎస్ఈలు, ఈఈలు, ఇతర అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో సాగునీటి సౌకర్యాలు మెరుగుపడితే రైతుల జీవితాల్లో స్పష్టమైన మార్పు వస్తుందని, ఈ ప్రాజెక్టులు ఆ ప్రాంత అభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…