ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని చికెన్ షాప్‌ల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు చేపడుతుంది. రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ (AP Meat Development Corporation) సీరియస్‌గా స్పందిస్తూ, అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోనుంది. చికెన్ తక్కువ నాణ్యత, అక్రమ వ్యాపారం, పునరావృతమయ్యే మాంసం మాఫియా కార్యకలాపాలు గుర్తించడానికి ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగినది.
ఇప్పటి నుండి ప్రతి చికెన్ షాప్‌కు ప్రత్యేక లైసెన్స్ తప్పనిసరి అవుతుంది. ఈ లైసెన్స్ ద్వారా పౌల్ట్రీ ఫారమ్ నుండి షాప్ వరకు మొత్తం లావాదేవీలు డిజిటల్‌గా ట్రాక్ చేయబడతాయి. దీనిని ప్రభుత్వం Farm to Shop Tracking System అని పిలుస్తోంది. దుకాణ యజమానులు ఎవరికి, ఎంత మాంసం విక్రయిస్తారో పూర్తి వివరాలు రిజిస్టర్ చేయబడతాయి. ఇది ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన చికెన్, మటన్ అందించడానికి కీలకంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
మున్సిపాలిటీలు, పంచాయతీలో అక్రమంగా పనిచేస్తున్న షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. సరైన లైసెన్స్ లేకుండా పనిచేస్తున్న షాపులను వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. హోటల్, రెస్టారెంట్ యజమానులు లైసెన్స్ మరియు శుభ్రం కలిగిన షాపుల నుండి మాత్రమే మాంసం కొనుగోలు చేయాలి సూచనలు ఇవ్వడం జరిగినది. స్టెరాయిడ్, హార్మోన్ కలిగిన కోళ్లు, గొర్రెలు, మేకలు, ఆవులు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోబడతాయి ప్రభుత్వం హెచ్చరించడం జరిగినది.
అంతేకాదు వ్యర్థాలను ప్రత్యేక బాయో-హాజర్డ్ కంటైనర్లలో సేకరించి పర్యావరణానికి అనుగుణంగా చేస్తారు. ఈ కొత్త నియమాలు ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన చికెన్, మటన్ అందుతుంది వ్యాపారంలో అక్రమాలు తగ్గతాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది ప్రభుత్వం హెల్తీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకునే దిశగా తీసుకున్న పెద్ద అడుగు చెబుతున్నారు.చికెన్ ప్రేమికులకు ఇది నిజమైన గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.