H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి బాట: కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! AP Ministers: సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం... తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం! Iran-USA: అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త చర్చ.. ట్రంప్ వ్యూహం ఫలించిందా!! USA Iran: అమెరికాతో రెండో విడత చర్చలు! ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఇరాన్...! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి బాట: కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! AP Ministers: సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం... తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం! Iran-USA: అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త చర్చ.. ట్రంప్ వ్యూహం ఫలించిందా!! USA Iran: అమెరికాతో రెండో విడత చర్చలు! ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఇరాన్...! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

చెన్నైలో భారీ కలకలం.. 9 విదేశీ రాయబార కార్యాలయాలకు బాంబు బెదిరింపులు.. నగరంలో హై అలర్ట్!

చెన్నై మహానగరంలో మంగళవారం నాడు ఒక్కసారిగా భద్రతాపరమైన కలకలం రేగింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా తొమ్మిది విదేశీ రాయబార కార్యాలయాలకు (ఎంబసీలకు) బాంబు బెదిరింప

Published : 2025-09-30 21:23:00
TGPSC: గ్రూప్–3 ప్రొవిజినల్‌ సెలక్షన్‌ జాబితా విడుదల..! 4,500 మందికి పైగా ఎంపిక!

చెన్నై మహానగరంలో మంగళవారం నాడు ఒక్కసారిగా భద్రతాపరమైన కలకలం రేగింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా తొమ్మిది విదేశీ రాయబార కార్యాలయాలకు (ఎంబసీలకు) బాంబు బెదిరింపులు రావడం తమిళనాడు పోలీసు విభాగం, కేంద్ర భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేసింది. ఈ అసాధారణ ఘటనతో చెన్నైలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

అరుణాచలంలో ఘోరం.. రక్షణ కల్పించాల్సిన పోలీసులే రాక్షసులుగా మారారు.. ఆంధ్ర యువతిపై అత్యాచారం!

తేనాంపేటలోని ముఖ్యమైన అమెరికా కాన్సులేట్‌తో పాటు, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, శ్రీలంక వంటి మరో ఎనిమిది దేశాల ఎంబసీలకు ఆగంతకుల నుంచి ఈ బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. ఆయా కార్యాలయాల్లో బాంబులు పెట్టామంటూ వచ్చిన ఈ హెచ్చరికలతో భద్రతా బలగాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే రంగంలోకి దిగాయి. ప్రజల భద్రత దృష్ట్యా, పోలీసులు వెంటనే ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లకు భారీ షాక్..! నవంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు..!

ఈ బాంబు బెదిరింపులు కేవలం సాధారణ అల్లరి చర్యలు కాదని, వీటి వెనుక ఏదో ఒక రాజకీయ కోణం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు కారణం, ఈ బెదిరింపు సందేశాల్లో కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావనకు రావడం.

APSDMA alert: రేపు రాష్ట్రంలో భారీ వర్షాల.. అత్యవసర సహాయం కోసం 1070 టోల్‌ఫ్రీ నంబర్.. APSDMA అలర్ట్!

పది వేర్వేరు ఈమెయిల్ ఐడీల నుంచి ఈ బెదిరింపు సందేశాలు ఏకంగా డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) కార్యాలయానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బెదిరింపులను చాలా సీరియస్‌గా తీసుకుని, సైబర్ క్రైమ్ పోలీసులను రంగంలోకి దింపారు.

Nominated Posts: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో రెండు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం.. లిస్ట్ ఇదిగోండి!

ఈ మెయిల్స్‌లో డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పేరును ప్రస్తావించడం మరియు ఇటీవల జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనను గురించి పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో మంత్రి పేరును ప్రస్తావిస్తూ ఇటీవల ఒక నటుడు విజయ్ పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

E Arrival Card System: ఇకపై ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద పొడవైన క్యూ లైన్లకు చెక్.. థాయిలాండ్, సింగపూర్, మలేషియా తరహాలో భారత్‌లో కొత్త సిస్టమ్!

బాంబు బెదిరింపుల ద్వారా రాజకీయ అంశాలను ప్రస్తావించడం వెనుక ఏదైనా ప్లాన్ ఉందా? దీని వెనుక ఉన్నది రాజకీయ ప్రత్యర్థులా? లేక కరూర్ ఘటనతో బాధపడిన వారే ఈ బెదిరింపులకు పాల్పడ్డారా? అనే కోణంలోనూ పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.

RBI Rules: గోల్డ్, సిల్వర్ రుణాలపై ఆర్బీఐ కొత్త నిబంధనలు! అక్టోబర్ 1 నుంచే అమలు!

బెదిరింపులు వచ్చాయి కాబట్టి, భద్రతాపరంగా ఎలాంటి చిన్నపాటి రిస్క్ కూడా తీసుకోకూడదని చెన్నై పోలీసులు నిర్ణయించారు. నగరంలోని అన్ని కాన్సులేట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
భారీ భద్రత: ఎంబసీల పరిసరాల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించి, ఎవరూ అనుమానాస్పదంగా కనిపించకుండా నిఘా పెట్టారు.

Visa: అమెరికాలో H-1B వీసా షాక్..! కీలక ప్రాజెక్టులు భారత్‌లోకి తరలింపు..!

బాంబ్ స్క్వాడ్ (Bomb Squad), డాగ్ స్క్వాడ్ (Dog Squad) బృందాలతో ప్రతి ఎంబసీ కార్యాలయాన్ని, దాని పరిసరాల్లోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

One rupee house: పేద, మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తు.. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు!

ప్రస్తుతానికి అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం, తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. అయినప్పటికీ, భద్రత ఇంకా కొనసాగుతోంది. ఇదే తరహాలో ముంబయి-దిల్లీ ఇండిగో విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడం ఈ ఘటనల వెనుక ఒకే ముఠా ప్రమేయం ఉందా అనే అనుమానాన్ని బలపరుస్తోంది. 

UPI ID మార్పు ఇప్పుడు సులభం..! కొత్త ఫీచర్ స్టెప్ బై స్టెప్ గైడ్..!

ఈ వరుస బెదిరింపుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నారు. త్వరలోనే అసలు నిజాలు బయటపడతాయని ఆశిద్దాం.

డబుల్ టెన్షన్.. రాబోయే 24 గంటల్లో.! వర్ష సూచనతో పాటు కృష్ణా వరద ఉద్ధృతి.. ఎల్లో అలర్ట్ జారీ!
Bank Holidays: అయ్య బాబోయ్! అక్టోబర్ నెలలో ఇన్ని సెలవలా... మొత్తం 21 రోజులు!
యువ నిపుణులకు గుడ్ న్యూస్.. సరికొత్త వీసా నిబంధనలు, 4 ప్రత్యేక విజిట్ వీసాలు విడుదల!
గర్బా ఉత్సవాల్లో అసభ్యత.. సోషల్ మీడియా వైరల్ .. మరి ఇలా ఉన్నారు ఏంట్రా అంటూ కామెంట్స్!
Piracy: టాలీవుడ్‌-సైబర్ పోలీసుల భేటీ..! పైరసీ ముఠాల అసలు కథ బట్టబయలు..!

Spotlight

Read More →