Sharif: లైవ్ కెమెరాలు ఆపేసి నాపై దాడి చేశారు.. మంత్రి నేరుగా.. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై మాజీ ఛైర్మన్ ఆవేదన.! APNRT: ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రుల సంబరాలు.. ఎన్నారైలకు ఏపీఎన్ఆర్టీ ప్రత్యేక పిలుపు.. మీ సంతోషాన్ని పంచుకోండి - రవి వేమూరు APThanksIndia: జాతీయ స్థాయిలో ఏపీ గళం - 'X'లో నంబర్ వన్ స్థానంలో.. లక్షలాది ట్వీట్లతో టాప్ ప్లేస్‌కు.. నిమిషాల్లోనే వైరల్.! Muntha Masala Recipe: గరం గరం "ముంత మసాలా" - ఇంట్లోనే రోడ్ సైడ్ టేస్ట్ పక్కా! Nara Lokesh: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని... ఢిల్లీ వేదికగా లోకేశ్ గర్జన! Parliament special session: దేశ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్.. మూడు రోజుల పాటు ఢిల్లీలో హైడ్రామా.. ఉత్కంఠ రేపుతున్న ప్రత్యేక సెషన్.! IRCTC: వేసవిలో వైజాగ్ - అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.... Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం! Dhurandhar-2: ధురంధర్ 2 సునామీ! 12 రోజుల్లో రూ. 1,400 కోట్లు.. రణవీర్ సింగ్ మాస్ ర్యాంపేజ్! Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం... కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి! Sharif: లైవ్ కెమెరాలు ఆపేసి నాపై దాడి చేశారు.. మంత్రి నేరుగా.. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై మాజీ ఛైర్మన్ ఆవేదన.! APNRT: ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రుల సంబరాలు.. ఎన్నారైలకు ఏపీఎన్ఆర్టీ ప్రత్యేక పిలుపు.. మీ సంతోషాన్ని పంచుకోండి - రవి వేమూరు APThanksIndia: జాతీయ స్థాయిలో ఏపీ గళం - 'X'లో నంబర్ వన్ స్థానంలో.. లక్షలాది ట్వీట్లతో టాప్ ప్లేస్‌కు.. నిమిషాల్లోనే వైరల్.! Muntha Masala Recipe: గరం గరం "ముంత మసాలా" - ఇంట్లోనే రోడ్ సైడ్ టేస్ట్ పక్కా! Nara Lokesh: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని... ఢిల్లీ వేదికగా లోకేశ్ గర్జన! Parliament special session: దేశ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్.. మూడు రోజుల పాటు ఢిల్లీలో హైడ్రామా.. ఉత్కంఠ రేపుతున్న ప్రత్యేక సెషన్.! IRCTC: వేసవిలో వైజాగ్ - అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.... Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం! Dhurandhar-2: ధురంధర్ 2 సునామీ! 12 రోజుల్లో రూ. 1,400 కోట్లు.. రణవీర్ సింగ్ మాస్ ర్యాంపేజ్! Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం... కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి!

Sharif: లైవ్ కెమెరాలు ఆపేసి నాపై దాడి చేశారు.. మంత్రి నేరుగా.. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై మాజీ ఛైర్మన్ ఆవేదన.!

Former Chairman Sharif: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఎ. షరీఫ్ గతంలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో చోటుచేసుకున్న విస్మయకర పరిణామాలపై తొలిసారిగా నోరువిప్పారు. నాడు సభలో లైవ్ కెమెరాలు కట్ చేసిన తర్వాత జరిగిన అమానవీయ ఘటనలను ఆయన సంచలన వ్యాఖ్యల ద్వారా బయటపెట్టారు.

Published : 2026-04-02 22:58:00
  • Politics: కులం పేరుతో దూషణలు.. పుట్టుకపై నిందలు: వైసీపీ సభ్యుల ప్రవర్తనపై మాజీ ఛైర్మన్ ఆవేదన..
     
  • "సిబ్బందిని రాకుండా అడ్డుకున్నారు": సభలో ఒంటరిని చేసి వైసీపీ నేతల దౌర్జన్యం - మాజీ ఛైర్మన్ సంచలనం..

Former Chairman Sharif: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఎ. షరీఫ్ గతంలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో చోటుచేసుకున్న విస్మయకర పరిణామాలపై తొలిసారిగా నోరువిప్పారు. నాడు సభలో లైవ్ కెమెరాలు కట్ చేసిన తర్వాత జరిగిన అమానవీయ ఘటనలను ఆయన సంచలన వ్యాఖ్యల ద్వారా బయటపెట్టారు. ఆ సమయంలో అధికార పార్టీకి చెందిన ఒక మంత్రి నేరుగా తనపై చేయి చేసుకున్నారని, మరో మంత్రి తనను కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, తన పుట్టుకను కూడా నిందించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభా మర్యాదలను గాలికొదిలేసి వైసీపీ సభ్యులంతా ఏకమై తనపైకి దాడికి వచ్చారని, కనీసం తనకు రక్షణగా నిలవాల్సిన మార్షల్స్ మరియు సిబ్బందిని కూడా తన దగ్గరకు రాకుండా అడ్డుకున్నారని ఆయన వెల్లడించారు.

అంతటితో ఆగకుండా వైసీపీ సభ్యులు తనను తీవ్రంగా బెదిరించడమే కాకుండా రకరకాల ప్రలోభాలకు గురిచేశారని షరీఫ్ పేర్కొన్నారు. తన ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని, తమకు అనుకూలంగా వ్యవహరిస్తే మెరుగైన బతుకుదెరువు చూపిస్తామని ఆశ చూపారని, మాట వినకపోతే ఏకంగా శాసనమండలినే రద్దు చేస్తామని హెచ్చరించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇన్ని రకాల ఒత్తిళ్లు, అవమానాలు ఎదురైనప్పటికీ, తనకు ఉన్న అధికారంతో మూడు రాజధానుల బిల్లును ఆమోదించకుండా కేవలం ధర్మం వైపు మాత్రమే నిలబడ్డానని ఆయన స్పష్టం చేశారు. నాడు తాను పడ్డ శ్రమకు ఫలితంగా నేడు అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధత సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →