సమంతా రూత్ ప్రభు ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం చేసుకున్నది సినీ ప్రపంచంలోనే పెద్ద వార్తగా నిలిచింది. డిసెంబర్ 1న వీరి పెళ్లి కోయంబత్తూరులో ఆత్మీయంగా జరిగింది. వివాహ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి తర్వాత చాలామంది సమంతా కొంతకాలం విరామం తీసుకుంటారని భావించారు. కానీ ఆమె తన ప్రత్యేక శైలి ప్రకారం సెలబ్రేషన్‌కి బ్రేక్ పెట్టకుండా మళ్లీ పనిలోకి చేరిపోయింది.
సమంతా తన కొత్త తెలుగు చిత్రమైన ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లో చేరిన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. మేకప్ రూమ్ నుంచి తీసిన ఓ ఫోటోను షేర్ చేస్తూ “Let’s go Maa Inti Bangaram” అని రాశారు. అంటే పెళ్లి తర్వాత కూడా ఆమె తన కెరీర్‌పై ఉన్న అంకితభావం ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. నటిగా ఆమె ఎప్పుడూ కొత్త పాత్రలను, కొత్త అవకాశాలను స్వాగతిస్తూ ముందుకు సాగుతుండటం ఆమె అభిమానులను సంతోషపరుస్తోంది.
కొన్ని రోజుల క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమం కోయంబత్తూరులో జరిగింది. సమంతా ఫోటోలు షేర్ చేస్తూ “మా ఇంటి బంగారం ప్రయాణం ప్రారంబమైంది, ఆశీర్వాదాలతో నిండిన రోజు” అని పేర్కొంది. ఈ సినిమా టీమ్ తమ ప్రత్యేక కథను ప్రేక్షకులకు అందించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమంతా కూడా అభిమానుల మద్దతు కోరుతూ మంచి సినిమా ఇవ్వాలని సంకల్పం వ్యక్తం చేసింది.
రాజ్ నిడిమోరుతో సమంతా గతంలో ‘ది ఫ్యామిలీ మాన్ 2’ లో కలిసి పనిచేసింది. ఆ వెబ్ సిరీస్ విజయం వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని మరింత బలపరిచింది. అదే సమయంలో వీరి సంబంధం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. సమంతా మరియు రాజ్ ఒకే సమయంలో కనిపించిన ఫోటోలు ఈ రూమర్లను మరింత బలపరిచాయి. చివరకు ఈ ఊహాగానాలకు ముగింపు పలుకుతూ డిసెంబర్‌లో వివాహం జరిపారు.
వివాహం తర్వాత సోషల్ మీడియాలో ఓ పాత ఇంటర్వ్యూ క్లిప్ మళ్లీ వైరల్ అయింది. అందులో రాజ్ సమంతా గురించి ఎంతో ప్రేమగా మాట్లాడిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. ఆమె కష్టపడే తీరు, ప్రతీ పాత్రను అర్థం చేసుకోవడంలో చూపే శ్రద్ధ, సన్నివేశాల కోసం తీసుకునే ప్రిపరేషన్ అన్ని ఆమెను “గీక్, బుక్‌వార్మ్” అని ముద్దుగా పిలిచారు. ఆమె చదివి, అర్థం చేసుకుని, తర్వాత నటించినప్పటికీ, సెట్‌లో అది ఎంతో సహజంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు.
సమంతా వ్యక్తిగత జీవితంలో గతంలో భారీ చర్చలే జరిగాయి. 2017లో నటుడు నాగ చైతన్యతో పెళ్లి జరిగి, 2021లో విడిపోయారు. ఆ తర్వాత సమంతా సినీ కెరీర్‌లో ముందుకు సాగారు. ఇప్పుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించడం ఆమె అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తించింది.
పెళ్లి రోజుకే తిరిగి పని ప్రారంభించడం ద్వారా సమంతా మరోసారి నిరూపించింది వ్యక్తిగత సంతోషం, కెరీర్ రెండూ సమానంగా కొనసాగించగలదని. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ ఎలా ఉండబోతుంది? సమంతా ఏ పాత్రలో కనిపించబోతుంది? అనే ఆసక్తి ఇప్పటికే పెరుగుతోంది.