AP Govt: పేద–ధనిక తేడా లేకుండా ఉచిత వైద్యం…! యూనివర్సల్ హెల్త్ పాలసీలో భారీ సంస్కరణలు! Diabetes Awareness: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. షుగర్​ పరీక్ష చేయించాల్సిందే!! Chia Seeds: చియా సీడ్స్‌ రెగ్యులర్‌గా తింటున్నారా? అయితే ఈ విషయం అస్సలు మిస్ కావొద్దు! Scrub typhus: స్క్రబ్ టైఫస్పై భయపడాల్సిన అవసరం లేదు.. మంత్రి సత్యకుమార్ భరోసా! Health Tips: బట్టర్‌కు హెల్తీ ప్రత్యామ్నాయాలు.. వంటలోనూ బేకింగ్‌లోనూ ఇవే బెస్ట్! Yoga Naturopathy: అమరావతిలో రూ.750 కోట్ల యోగా నేచురోపతి ఇన్స్టిట్యూట్... వెల్‌నెస్ & రీసెర్చ్ గ్లోబల్ హబ్‌గా! Killer Fever: రైతులు, కార్మికులు హై రిస్క్…! వేగంగా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్! Scrub typhus cases: భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుదల.. ఆరోగ్య శాఖ అలర్ట్! health tips: ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే ఎనిమిది శక్తివంతమైన ఆహారాలు… ఆరోగ్యాన్ని కాపాడే సహజ రక్షకాలు!! Health Tips: టెక్ నెక్‌ పెరుగుదల ఆందోళనకరం మెడ నొప్పిని తగ్గించే సులభ యోగా ఆసనాలు ఇవే!! AP Govt: పేద–ధనిక తేడా లేకుండా ఉచిత వైద్యం…! యూనివర్సల్ హెల్త్ పాలసీలో భారీ సంస్కరణలు! Diabetes Awareness: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. షుగర్​ పరీక్ష చేయించాల్సిందే!! Chia Seeds: చియా సీడ్స్‌ రెగ్యులర్‌గా తింటున్నారా? అయితే ఈ విషయం అస్సలు మిస్ కావొద్దు! Scrub typhus: స్క్రబ్ టైఫస్పై భయపడాల్సిన అవసరం లేదు.. మంత్రి సత్యకుమార్ భరోసా! Health Tips: బట్టర్‌కు హెల్తీ ప్రత్యామ్నాయాలు.. వంటలోనూ బేకింగ్‌లోనూ ఇవే బెస్ట్! Yoga Naturopathy: అమరావతిలో రూ.750 కోట్ల యోగా నేచురోపతి ఇన్స్టిట్యూట్... వెల్‌నెస్ & రీసెర్చ్ గ్లోబల్ హబ్‌గా! Killer Fever: రైతులు, కార్మికులు హై రిస్క్…! వేగంగా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్! Scrub typhus cases: భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుదల.. ఆరోగ్య శాఖ అలర్ట్! health tips: ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే ఎనిమిది శక్తివంతమైన ఆహారాలు… ఆరోగ్యాన్ని కాపాడే సహజ రక్షకాలు!! Health Tips: టెక్ నెక్‌ పెరుగుదల ఆందోళనకరం మెడ నొప్పిని తగ్గించే సులభ యోగా ఆసనాలు ఇవే!!

AP Govt: పేద–ధనిక తేడా లేకుండా ఉచిత వైద్యం…! యూనివర్సల్ హెల్త్ పాలసీలో భారీ సంస్కరణలు!

2025-12-05 15:12:00
OTT Movie: వెంటాడే ఆత్మ.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ హారర్ థ్రిల్లర్.. రెండు ఓటీటీల్లో!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి నాణ్యమైన మరియు అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ అమలు దిశగా కీలక అడుగులు వేస్తోంది. పేద–ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపుదిద్దిన ప్రభుత్వం, మొత్తం రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ భారీ ఆరోగ్య సంరక్షణ విధానం అమలులో భాగంగా ఇప్పటి ఎన్టీఆర్ వైద్యసేవలు–ఏబీపీఎంజేఏవై పథకాన్ని హైబ్రిడ్ మోడ్‌లో అమలు చేయడానికి టెండర్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వ యంత్రాంగం శ్రీకారం చుట్టింది.

PM Kisan Update: శుభవార్త.. పీఎం కిసాన్ 22వ విడత! రైతుల అకౌంట్లలోకి మళ్లీ రూ.2 వేలు, వచ్చేది అప్పుడే!

వైద్యారోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఈ సరికొత్త విధానానికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ పథకం ప్రకారం వార్షికాదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న నిరుపేద కుటుంబాలకు రూ. 2.50 లక్షల వరకు పూర్తిగా ఇన్సూరెన్స్ విధానంలో వైద్యం అందిస్తారు. ఒకవేళ ఆ కుటుంబం చికిత్స ఖర్చులు ఈ పరిమితిని మించి ఉంటే, అదనంగా అయ్యే రూ. 25 లక్షల వరకు వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ నేరుగా భరిస్తుంది. మరోవైపు, దారిద్ర్య రేఖకు పైబడిన ఏపీఎల్ కుటుంబాలకు కూడా రూ. 2.50 లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తించేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది.

Food for Russia : రష్యాకు ఫుడ్… భారత్‌కు ఆయిల్.. పుతిన్ మోదీ చర్చల్లో కీలక ఒప్పందం!

పథకం అమలుకు పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థ అవసరమని భావించిన ప్రభుత్వం టెండర్ నిబంధనల్లో కూడా కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ రేషియో 120 శాతాన్ని దాటిన సందర్భంలో, ప్రీమియం మొత్తాన్ని మించిన అదనపు భారాన్ని బీమా కంపెనీ, ఎన్టీఆర్ ట్రస్ట్ సమానంగా పంచుకోవాలని నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే 521 రకాల ప్రత్యేక చికిత్సలకు అయ్యే ఖర్చులను ముందుగా బీమా సంస్థలు చెల్లించి, ఆ తరువాత ట్రస్ట్ నుంచి రీయింబర్స్‌మెంట్ తీసుకునే విధానం ప్రవేశపెట్టారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు మరింత బలోపేతమవుతాయి.

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం.. తస్మాత్ జాగ్రత్త! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS), వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ మినహా మిగతా అన్ని కుటుంబాలు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీకి అర్హులు. ఇప్పటికే పీఎంజేఏవై, ఎన్టీఆర్ వైద్య సేవల లబ్ధిదారులు కూడా ఈ కొత్త విధానంలో భాగమవుతారు. మొత్తం మీద ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించబడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సాధారణ కుటుంబాలకు భారంగా మారుతున్న వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గించి, ఆరోగ్య సేవలను అందరికీ చేరవేయడంలో ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ కీలక పాత్ర పోషించనున్నట్లు అధికారులు విశ్వసిస్తున్నారు.

AP Education: విద్యా సంస్కరణలే రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకు కీలకం... మంత్రి లోకేష్!!
IndiGo: ఇండిగోకే సమస్య ఎందుకు.. సిబ్బంది కొరతే మూలం... FDTL రూల్స్‌లో సడలింపులు!
Mega PT Meeting: చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్!
Germany Jobs: జర్మనీలో భారీ ఉద్యోగ అవకాశాలు! వసతి, వీసా, ఫ్లైట్ ఫ్రీ... దరఖాస్తు వివరాలు!
Putin India Visit: మోదీ–పుతిన్ ఒకే కారులో ప్రయాణం… అందరి దృష్టి ఆ కారుపైనే!!
ఒక్కరోజే 92 విమానాల రద్దు - శంషాబాద్‌లో రణరంగం! నిరసనలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్! కేంద్ర మంత్రికి ఫోన్..

Spotlight

Read More →