ఖతార్ NBK ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున, ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు చివరి క్షణంలో రద్దు కావడం పట్ల మా తీవ్ర నిరాశను తెలియజేస్తున్నాము. నందమూరి బాలకృష్ణ గారి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న NBK అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. అలాంటి సమయంలో, చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన అకస్మిక సాంకేతిక సమస్యల కారణంగా షోలు రద్దు కావడం ఖతార్‌లో ఉన్న వేలాది మంది అభిమానులకు పెద్ద షాక్‌గా మారింది. మా కోసం ఇది కేవలం సినిమా కార్యక్రమం కాదు, ఒక వైభవమైన అభిమానుల పండుగ, చరిత్రలో నిలిచిపోయే వేడుక.
Akhanda2: అఖండ 2 ప్రీమియర్ షో క్యాన్సిల్…! ఖతార్ NBK అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి!