Donald Trump: ఇరాన్ సహకరించకుంటే మళ్లీ బాంబుదాడులు మొదలవుతాయి! ఇరాన్ సహా అందరికీ ట్రంప్ హెచ్చరిక Chandrababu: రాష్ట్రంలో 7.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం.. రాబోయే సాగు సీజన్‌పై ప్రభుత్వం క్లారిటీ! Chandrababu: మెరైన్ ఉత్పత్తిగా సంపద సృష్టికి సీవీడ్ కీలకం.. ఎస్‌హెచ్‌జీ మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు! Telangana: కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి భేటీ! హైదరాబాద్ మెట్రో రెండో దశపై కీలక చర్చ! UIDAI Jobs: ఆధార్ కేంద్రాల్లో ఉద్యోగాల జాతర... 344 సూపర్ వైజర్, ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్! Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ షాక్.. తమిళనాట నిలిచిన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ! Beer Price: మందుబాబులకు 'షాక్': పెరగనున్న బీర్ ధరలు.. బాటిళ్లకు మార్కెట్లో తీవ్ర కొరత! Tamil Nadu: 108 సీట్లతో విజయ్ ప్రభంజనం.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్న నూతన సీఎం! Papikondalu trip: పర్యాటకులకు చేదువార్త: పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా నిలిపివేత! Political Updates: తోపుదుర్తికి పోలీసుల నోటీసులు! తమిళనాట సర్కార్ ఏర్పాటుకు వేళాయే... Donald Trump: ఇరాన్ సహకరించకుంటే మళ్లీ బాంబుదాడులు మొదలవుతాయి! ఇరాన్ సహా అందరికీ ట్రంప్ హెచ్చరిక Chandrababu: రాష్ట్రంలో 7.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం.. రాబోయే సాగు సీజన్‌పై ప్రభుత్వం క్లారిటీ! Chandrababu: మెరైన్ ఉత్పత్తిగా సంపద సృష్టికి సీవీడ్ కీలకం.. ఎస్‌హెచ్‌జీ మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు! Telangana: కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి భేటీ! హైదరాబాద్ మెట్రో రెండో దశపై కీలక చర్చ! UIDAI Jobs: ఆధార్ కేంద్రాల్లో ఉద్యోగాల జాతర... 344 సూపర్ వైజర్, ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్! Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ షాక్.. తమిళనాట నిలిచిన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ! Beer Price: మందుబాబులకు 'షాక్': పెరగనున్న బీర్ ధరలు.. బాటిళ్లకు మార్కెట్లో తీవ్ర కొరత! Tamil Nadu: 108 సీట్లతో విజయ్ ప్రభంజనం.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్న నూతన సీఎం! Papikondalu trip: పర్యాటకులకు చేదువార్త: పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా నిలిపివేత! Political Updates: తోపుదుర్తికి పోలీసుల నోటీసులు! తమిళనాట సర్కార్ ఏర్పాటుకు వేళాయే...

Chandrababu: రైతులకు లాభదాయక ధరలు లక్ష్యం.. పంటల కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష!

Chandrababu: రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పంటలకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ వంటి ముఖ్య పంటల కొనుగోళ్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

Published : 2026-05-06 20:14:00

రాష్ట్రంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్ల పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..

మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు ధరలు దక్కేలా చూడాలని సీఎం దిశానిర్దేశం..

అమరావతి: రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పంటలకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ వంటి ముఖ్య పంటల కొనుగోళ్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తో పాటు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందాలంటే మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.

పంటలకు మంచి ధరలు రావాలంటే ట్రేసబిలిటీ (పంట మూలాన్ని గుర్తించే విధానం), సర్టిఫికేషన్ వంటి వ్యవస్థలను అమలు చేయాలని సూచించారు. ఇవి రైతులకు అదనపు లాభం అందించే అవకాశముందని తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి వచ్చే అవకాశముందని సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, నాణ్యమైన దిగుబడులు సాధించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

అలాగే, ప్రకృతి సేద్యం విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తే రైతులకు ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని చంద్రబాబు అన్నారు. విభిన్న పంటలను సాగు చేయడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని ఆయన వివరించారు. రైతు ఆదాయం పెరగడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

Spotlight

Read More →