గౌరవ ముఖ్యమంత్రి, N. చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆయన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ కువైట్‌లో మహా రక్తదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాన్ని NRI తెలుగు దేశం కువైట్ ఆధ్వర్యంలో గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు శ్రీ వెంకట్ కోడూరి గారి అధ్యక్షతన కువైట్‌లోని అడాన్ హాస్పటల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది.200 మంది రక్తదానం చేయగా 500 పైగా అభిమానులు హాజరు అయ్యారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన వెంకట్ కోడూరి గారు మాట్లాడుతూ, “తెలుగు ప్రజల గర్వకారణమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తూ భారత రాజకీయాల్లో అరుదైన స్థానాన్ని సంపాదించారు. అభివృద్ధి అంటే ఏమిటో, పరిపాలనలో పారదర్శకత ఎలా ఉండాలో, ప్రజల కోసం పాలన ఎలా సాగాలో తన దూరదృష్టితో చూపించిన మహానేత ఆయన” అని కొనియాడారు.
“రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి అపారమైంది. సమాచార సాంకేతికత, మౌలిక వసతులు, పెట్టుబడులు, యువతకు అవకాశాలు—ఈ అన్ని రంగాలలో ఆయన చూపించిన నాయకత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి మహానేత జన్మదినాన్ని కేవలం వేడుకలతో కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం మా అందరికీ గౌరవంగా భావిస్తున్నాం” అని వెంకట్ కోడూరి గారు తెలిపారు.
“రక్తదానం మహాదానం. మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ఒకరి ప్రాణాన్ని కాపాడగలదు. అందుకే మా ప్రియ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని సేవా దినోత్సవంగా మార్చి ఈ మహా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రపంచంలోని ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలు సమాజ సేవలో ముందుండాలని ఈ కార్యక్రమం ద్వారా ఒక బలమైన సందేశాన్ని ఇస్తున్నాం” అని ఆయన అన్నారు.
రక్తదాన దాతలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు దాతలును అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని పంపించారు.
డాక్టర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షురాలు డా సుసోవనా ప్రముఖ, మాజీ అధ్యక్షులు డా దివాకర్. కమ్యూనిటీ కార్యదర్శి డా రఘునందన్, బ్లడ్ డోనర్స్ కేరళ నిమిష్ కుమార్, జయన్ గార్లకు ప్రత్యేక ధన్యవాదములు
ఈ రక్తదాన శిబిరానికి విలువైన సహకారం అందించిన
ఏపీఎన్‌ఆర్‌టీఎస్ అధ్యక్షులు డాక్టర్ రవి వేమూరి గారికి,
NRI-తెలుగుదేశం గల్ఫ్ అధ్యక్షులు శ్రీ రావి రాధాకృష్ణ గారికి,
అలాగే ఏపీఎన్‌ఆర్‌టీఎస్ డైరెక్టర్ అక్కిల్ నాగేంద్రబాబు గారికి,, NRI-తెలుగుదేశం సెల్ చప్పిడి రాజశేఖర్ గారికి
ధన్యవాదాలు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి విశేషంగా కృషి చేసిన NRI తెలుగు దేశం కువైట్ సీనియర్ నాయకులు , ములకల సుబ్బారాయుడు సహకారం మరియు ధరూరి బలరాం నాయుడు ,ఉదయ్ ప్రకాశ్, ఓలేటి దివాకర్ , మాలేపాటి బాబు, పొలరుపు బాబు నాయుడు, Dr నెట్టెం కృష్ణ గార్లు కమిటీ సభ్యులు మోహన్ రాచూరి,శ్రీకాంత్ చింతల ,రవి మలిశెట్టి గార్లు, దొడ్డిపల్లి సుబ్బరాజు గారు, దౌర్ల సాయి, భాస్కర్, రవి, వెంకట సుబ్బయ్య, శశికుమార్, సాయి,,అస్మా గవర్నరెట్ అధ్యక్షులు ముస్తాక్ ఖాన్ వారి కమిటీ సభ్యుల, హవేలీ గవర్నరేట్ అధ్యక్షులు రెడ్డయ్య చౌదరి వారి కమిటీ సభ్యులు , ఫర్వానీయ గవర్నరేట్ అధ్యక్షులు రమేష్ చౌదరి వారి కమిటీ సభ్యులు, జహ్రా గవర్నరెట్ అధ్యక్షులు డా"కృష్ణ చైతన్య వారి కమిటీ సభ్యులు APNRTS సభ్యులు,Good will embassadors,తెలుగుయువత అధ్యక్షులు దుగ్గినేని మురళి వారి కమిటీ సభ్యులు,
TKS మాజీ అధ్యక్షులు క్రిష్ణం రాజు గారు సాయి వెంకటసుబ్బారావు గారు,
బీసీ విభాగ అధ్యక్షులు శంకర్ యాదవ్ వారి కమిటీ సభ్యులు,
మహిళ అధ్యక్షురాలు నారాయణమ్మ వారి కమిటీ సభ్యులు,
జనసేన కువైట్ అధ్యక్షులు హరి రాయల్ . ప్రసాద్ , మల్లికార్జున రాయల్ ,వారి కమిటీ సభ్యులు,
NTR సేవాసమితి అధ్యక్షులు బాల రెడ్డయ్య చౌదరి వారి కమిటీ సభ్యులు,
నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు నాగేష్ వారి కమిటీ సభ్యులు ,
జనం మనం ఉపాధ్యక్షులు జిలానీ భాష వారి కమిటీ సభ్యులు ,
బంజారా సేవాసమితి అధ్యక్షులు వారి కమిటీ సభ్యులు,
గల్ఫ్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కోడి నారాయణ వారి కమిటీ సభ్యులు,
సుగవాసి ప్రసాద్ బాబు యువసేన అధ్యక్షులు రెడ్డి శేఖర్ వారి కమిటీ సభ్యులు,
పరిటాల ట్రస్ట్ అధ్యక్షులు నరసింహులు వారి కమిటీ సభ్యులు,
పసుపులేటి బ్రహ్మయ్య సేవా సమితి అధ్యక్షులువారి కమిటీ సభ్యులు,
AP టీడీపీ యూత్ అధ్యక్షులు ఖాన్ వారి కమిటీ సభ్యులు,
బడుగు బలహీన వర్గాల నేత రామకృష్ణ వారి మిత్రబృందం,,,,,,..................
గారు వంటి నాయకులను వెంకట్ కోడూరి గారు ప్రత్యేకంగా అభినందించారు. వారి అహర్నిశల కృషి, సమన్వయం మరియు సేవాభావం వల్లే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగిందని తెలిపారు.
అలాగే బాలయ్య బాబు గారి అభిమానులు,జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, నారా రోహిత్ గారి అభిమానులు, విశేషంగా సహకరించిన తీరు ప్రశంసనీయం అని కొనియాడారు .వివిధ సంస్థల ప్రతినిధులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి మానవతా విలువలను చాటారు.
కువైట్‌లో ఉన్న తెలుగువారిని సమన్వయం చేయడంలో ఎన్నారై తెలుగుదేశం నాయకత్వం కీలక పాత్ర పోషించింది. ఎన్ఆర్ఐ-తెలుగుదేశం గల్ఫ్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ, ఏపీఎన్‌ఆర్‌టీఎస్ (APNRTS) అధ్యక్షులు డాక్టర్ రవి వేమూరి, డైరెక్టర్ అక్కిల్ నాగేంద్రబాబు మరియు సెల్ ప్రతినిధి చప్పిడి రాజశేఖర్ వంటి ప్రముఖులు ఈ శిబిరం విజయవంతం కావడానికి పూర్తి స్థాయిలో సహకరించారు. కువైట్ లోని ప్రతి ఒక్క తెలుగువాడిని భాగస్వామిని చేస్తూ, అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో వీరి కృషి అభినందనీయం. రక్తదాతల ఉత్సాహాన్ని చూసి అక్కడి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. క్రమశిక్షణతో కూడిన ఈ నిర్వహణ తెలుగువారి కీర్తిని మరింత పెంచింది.
కువైట్‌లో ఉన్న తెలుగు ప్రజల ఐక్యత, సేవా స్పూర్తి మరియు తమ నాయకుడిపై ఉన్న అపారమైన అభిమానాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించిందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండాలని వెంకట్ కోడూరి గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో 500 తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, పలు సేవా సంఘాల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న దాతలకు NRITDP కువైట్ జహ్రా గవర్నరేట్ మహిళా కోఆర్డినేటర్ ముండ్లపాటి నిర్మలా గారు ఈ కార్యక్రమానికి తేనెటి విందును ఏర్పాటు చేసి విశేష సహాయ సహకారాలు అందించారు. ఆమెకు NRI శ్రేణులు హృదయపూర్వక ధన్యవాదములు మరియు నిర్వాహకులు ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు తెలిపారు.