Highway Extension: ఏపీలో జాతీయ రహదారి విస్తరణ రూ.4,200 కోట్లతో.. ఈ రూట్లోనే! ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు!

2025-12-30 09:44:00
Airtel Recharge: తక్కువ ధరకే ఎక్కువ లాభాలు.. ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్ వివరాలు!

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కీలకమైన అనంతపురం–గుంటూరు జాతీయ రహదారి 544-డి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. వినుకొండ నుంచి గుంటూరు వరకు ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) చర్యలు ప్రారంభించింది.

Free Bus: ఏపీలో ఉచిత బస్సు పథకం కీలక అప్డేట్! పెరిగిన రద్దీ... ఇక నుండి మరింత సౌకర్యంగా!

ఈ రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కూడా మొదలైంది. గ్రీన్‌ఫీల్డ్ ప్రాంతంలో రహదారి హద్దులను గుర్తించే పనిని (పెగ్ మార్కింగ్) జనవరి 9లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిక బృందాలను ఏర్పాటు చేసి, నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.

APSRTC Promotions: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రమోషన్లలో కీలక మార్పులు! ఆ ఉద్యోగులకు ఏకంగా 16 సెలవులు!!

భూసేకరణ సర్వే పనులకు స్థానిక రెవెన్యూ అధికారుల సహకారం అవసరమని NHAI అధికారులు తెలిపారు. ఈ మేరకు NH ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీశం జిల్లా సంయుక్త కలెక్టర్‌కు లేఖ రాశారు. హద్దుల గుర్తింపు పూర్తైన తర్వాత, భూముల కొలతలు, విలువ అంచనా ప్రక్రియ మొదలవుతుంది.

Cough Relief: శీతాకాలం దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా... పడుకునే ముందు ఇలా చేస్తే సరి!

ఈ ప్రాజెక్టులో భాగంగా వినుకొండ నుంచి గుంటూరు వరకు మొత్తం 85 కిలోమీటర్ల రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో డీపీఆర్ పూర్తయ్యాక 3ఏ నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పనులు వేర్వేరుగా జరగనున్నందున ఆయా జిల్లాలకు ప్రత్యేక షెడ్యూల్‌లు విడుదల చేశారు.

Praja Vedika: నేడు (30/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

హైవే విస్తరణ పూర్తైతే అనంతపురం–గుంటూరు మధ్య రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుంది. వాహనాల రద్దీ తగ్గి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. దీంతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన, భద్రమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

AP Cabinet: ఏపీలో వారికి తీపికబురు.. వడ్డీ మాఫీ! కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. ఆ జిల్లాకు ఆ పేరు ఎందుకు? ప్రతి జిల్లాకు ఒక 'పోర్టు' - మరికొన్ని కీలక ఆమోదాలు..
Tollywood News: ముహూర్తం కుదిరింది.. విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి తేదీ ఫిక్స్! వేదిక ఎక్కడో తెలుసా?
ఏపీ రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్.. బియ్యంతో పాటు ఇక ఆ ఐదు రకాలు! ఒక్కొక్కరికి ఆరు కేజీలు..
YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ అరెస్ట్ చేయాలి.. VHP డిమాండ్!

Spotlight

Read More →