తిరుమల డిపో అధికారులు స్పష్టం చేశారు – తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఏ ఆర్టీసీ బస్సులకూ ఫ్రీ బస్ పథకం వర్తించదని. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (రూ.90), గరుడ ఏసీ (రూ.110), ప్యాకేజీ టూర్ బస్సులకు కూడా ఈ పథకం వర్తించదని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు దీనిని గమనించాలని సూచించారు.
తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్‌ల నుంచి భక్తుల సౌకర్యార్థం శ్రీవారి మెట్టుకు మరిన్ని బస్సు సర్వీసులు నడపాలని టీటీడీ అధికారులు ఆర్టీసీని కోరారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా నాన్-స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఫ్రీ బస్ పథకం వర్తించదని అధికారులు చెప్పారు.
అయితే, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రం మహిళలు జీరో టికెట్‌తో ప్రయాణించవచ్చు. ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు.