ఒకప్పుడు ఫోన్లను కీబోర్డ్ మాత్రమే వాడేవారు. కానీ నేటి సమాజంలో పరిస్థితి చాలా మారింది. నిన్నే కొన్న ఫోన్ అయినా, ఈరోజు కొత్త ఫోన్ మార్కెట్లో వచ్చిందంటే అది వెంటనే పాతదే అవుతుంది. ప్రజలు కొత్త ఫీచర్లు, డిజైన్ చూసి పాత ఫోన్‌ను వెంటనే పక్కన పెట్టి, కొత్త ఫోన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు చాలా వేగంగా జరుగుతుంది.
భారత మార్కెట్లో 5జీ ఫోన్ల డిమాండ్ రోజుకి రోజుకు పెరుగుతోంది. ఇలాంటి సందర్భంలో చైనాలోని ప్రముఖ ఫోన్ కంపెనీ vivo తన X300 సిరీస్ ను అక్టోబర్ 13న లాంఛ్ చేసింది. ఈ సిరీస్‌లో రెండు ఫోన్లు ఉన్నాయి: Vivo X300 మరియు Vivo X300 Pro.
ఈ ఫోన్లను ప్రత్యేకంగా నిలిపేది ప్రపంచంలోనే తొలి MediaTek Dimensity 9500 SoC ఆధారిత Android ఫ్లాగ్‌షిప్ ఫోన్లుగా ఉండడం. అంటే, ఫోన్ పనితీరు అత్యంత వేగవంతం, మరీ భారీ యాప్‌లు, గేమ్స్ కూడా సులభంగా రన్ అవుతాయి.
Vivo X300 ఫీచర్లు
డిస్‌ప్లే 6.31-ఇంచుల BOE Q10+ OLED LTPO, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్.
*ప్రాసెసర్ & స్టోరేజ్:MediaTek Dimensity 9500, 12GB RAM, 256GB UFS 4.0.
కెమెరా: 200MP ప్రధాన కెమెరా (Samsung HPB) 50MP అల్ట్రా వైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో. ఫ్రంట్ కెమెరా 50MP Samsung JN1.
బ్యాటరీ: 6,040mAh, 90W వైర్డ్, 40W వైర్‌లెస్ చార్జ్.
డిజైన్: IP68 వాటర్ & డస్ట్ రిస్టెన్స్, 190 గ్రాములు బరువు, 7.95mm మందం, Android 16 ఆధారిత OriginOS 6.
Vivo X300 Pro ఫీచర్లు
డిస్‌ప్లే: 6.78-ఇంచుల Round Micro-Curved BOE Q10+, 1.5K, 120Hz, సర్క్యులర్ పోలరైజేషన్ 2.0.
కెమెరా : 200MP ప్రధాన కెమెరా + 50MP OIS సెన్సార్ + 50MP అల్ట్రా వైడ్ + 200MP పెరిస్కోప్ టెలిఫోటో. ఫ్రంట్ 50MP సెల్ఫీ. V1, V3+ చిప్ తో ఫోటోగ్రఫీ మెరుగైనది.
బ్యాటరీ:6,510mAh, 90W వైర్డ్, 40W వైర్‌లెస్ చార్జ్.
డిజైన్: IP68, 226గ్రా, 7.99mm మందం.
రెండు ఫోన్ల ప్రత్యేకతలు
అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్
డ్యూయల్ స్పీకర్స్
X-అక్షం లీనియర్ మోటార్
Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS
USB 3.2 టైప్-C
ధర & రంగులు
Vivo X300:
12GB+256GB – ₹54,700
16GB+1TB – ₹72,900
రంగులు: ఫ్రీ బ్లూ, కంఫర్టబుల్ పర్పుల్, ప్యూర్ బ్లాక్
Vivo X300 Pro:
12GB+256GB – ₹65,900
16GB+1TB – ₹83,300
శాటిలైట్ ఎడిషన్ – ₹1,03,200
రంగులు: వైల్డర్నెస్ బ్రౌన్, సింపుల్ వైట్, ఫ్రీ బ్లూ, ప్యూర్ బ్లాక్
ఈ ఫోన్లు మెరుగైన కెమెరా, పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ప్రాసెసర్ తో వస్తాయి. డిజైన్ కూడా స్లిక్, లైట్, ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. ఎవరు ఫోటోలు ఎక్కువ దిగిస్తారో, గేమ్‌లు ఆడతారో 5జీ ఫోన్‌లో రఫ్గా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటారో వారికి Vivo X300 సిరీస్ నిజమైన ఎంపిక