అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ దంపతులు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ, వాటన్నిటికీ పుల్‌స్టాప్ పెడుతూ ఐశ్వర్య ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూ ఉంటుంది. అయితే, తాజాగా అభిషేక్ బచ్చన్ 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలో ఐశ్వర్యరాయ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలో అభిషేక్ బచ్చన్ ఉత్తమ నటుడిగా అవార్డు గెలిచారు. ఈ గౌరవాన్ని పొందినప్పుడు ఆయన చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం. సినిమా ఇండస్ట్రీలో 25 సంవత్సరాలుగా ఉన్నా, ఈ ఏడాది నాకు ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది" అని చెప్పుకొచ్చారు.
అభిషేక్ తన విజయానికి భార్య ఐశ్వర్య, కుమార్తె ఆరాధ్య కీలకమని తెలిపారు. నా జీవితంలో కలలు సాకారం చేసుకోవడానికి వారు నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఈ అవార్డుకు ఐశ్వర్య ప్రధాన కారణం. ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నాను అని తెలిపారు.
నా కుటుంబం ముందు ఈ అవార్డును స్వీకరించడం నాకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తోంది. సినిమాకు దర్శకత్వం వహించిన సూజిత్ సర్కార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను ప్రేమించి, అభిమానించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ విజయం నా తండ్రి అంకితం చేస్తున్నాను ఆయన లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అని కృతజ్ఞతలు తెలిపారు.