భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులలో ఒకటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఈ సంవత్సరం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, మనీష్ హోస్ట్‌లా నిర్వహించారు.
ఈ సంవత్సరం హైలైట్‌గా నిలిచిన చిత్రం లాపతా లేడీస్ స్పర్శ్ శ్రీవాత్సవ్, నితాన్షి గోయెల్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. కిరణ్ రావు దర్శకత్వంలో ఈ సినిమాను అమీర్ ఖాన్ నిర్మించారు. ఈ సినిమా సామాజిక సందేశం, గ్రామీణ నేపథ్యం, కామెడీ, ఎమోషన్స్ అన్నీ కలిపి ప్రేక్షకులు మరియు విమర్శకులను మెప్పించింది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 25 కోట్ల పైగా వసూలు చేసింది.
లాపతా లేడీస్ ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్‌లో 13 విభాగాల్లో అవార్డులు గెలిచింది. ముఖ్య అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకురాలు (కిరణ్ రావు), ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ డైలాగ్స్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ ఉన్నాయి. కొన్ని సాంకేతిక విభాగాల్లో కూడా అవార్డులు దక్కించుకొని, ఫిల్మ్‌ఫేర్ 2025లో అత్యధిక అవార్డులు గెలిచిన సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే ఇండియా తరపున ఆస్కార్ రేస్‌లో నిలిచినా అవార్డు గెలుచుకోలేకపోయింది.
మిగతా ముఖ్య అవార్డుల్లో ఉత్తమ నటుడు: అభిషేక్ బచ్చన్, కార్తీక్ ఆర్యన్; ఉత్తమ నటి: అలియా భట్. అలాగే, కాజోల్, కృతి సనన్, అనన్య పాండే, విక్కీ కౌశల్, జాన్ అబ్రహం తమ శక్తివంతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు సీనియర్ నటి జీనత్ అమన్ మరియు దివంగత దర్శకుడు శ్యామ్ బెనెగల్‌లకు అందించడం జరిగింది..