వివో తాజాగా X300 మరియు X300 ప్రో మొబైళ్లను ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు ప్రధానంగా ఫోటోగ్రఫీ మీద ఫోకస్ చేసి రూపొందించబడ్డాయి. ప్రత్యేకంగా ZEISS బ్రాండ్‌డ్ కెమెరా సెన్సర్లతో, ఈ ఫోన్లు మీ ఫొటోలు, వీడియోలు ప్రొఫెషనల్ లుక్‌తో దిగేవిధంగా చేస్తాయి. సాధారణ డే-టు-డే యూజ్, గేమింగ్ అవసరాలను కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాయి. అదనంగా, మెరుగైన డిస్‌ప్లే, బ్యాటరీ మరియు చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్లను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
వివో X300లో 6.3-ఇంచ్ LTPO డిస్‌ప్లే ఉంది. HDR10+ సపోర్ట్‌తో, 2K రిజల్యూషన్ స్క్రీన్ 120Hz రీఫ్రెష్ రేట్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ పై పనిచేసే ఈ ఫోన్, స్మూత్ గేమింగ్ మరియు హై-పర్‌ఫార్మెన్స్ యూజ్‌కు వీలుగా చేస్తుంది. కెమెరా సెటప్‌లో ZEISS ట్రిపుల్ మెయిన్ కెమెరా ఉంది: 200MP మెయిన్, 50MP సూపర్ టెలిఫోటో, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్. 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 6040mAh బ్యాటరీతో, 40W వైర్‌లెస్ మరియు 90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఇక వివో X300 ప్రోలో 6.78-ఇంచ్ ALOMED డిస్‌ప్లే ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్, మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్లతో, ఈ ఫోన్ మరింత విజువల్ ఇంపాక్ట్ ఇస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ పై పని చేస్తూ, కెమెరా సెటప్, బ్యాటరీ సామర్ధ్యం, ఛార్జింగ్ ఫీచర్లు X300తో సాదృశ్యం. అదనంగా, కెమెరా లెన్స్ సెట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది, ఫోటోగ్రఫీ ఆసక్తి కలిగిన వారికి మరింత ఆకర్షణీయంగా ఉంది.
ధరల విషయానికి వస్తే, ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్లు త్వరలో లాంచ్ కానున్నాయి. వివో X300 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ. 60,000 ధరలో ఉండవచ్చని అంచనా. X300 ప్రో మోడల్ ధర సుమారు రూ. 99,999 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రీమియం ఫీచర్లు, ZEISS కెమెరా, పावर్ఫుల్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్లు ఫోటో-లవర్స్ మరియు గేమర్స్ కోసం ఆకర్షణీయమైన ఎంపిక అవుతాయి.