టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఆయనను విచారించేందుకు ఈడీ ముందుగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ.. విజయ్ దేవరకొండతో పాటు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తదితరులకు కూడా నోటీసులు పంపింది. విజయ్ దేవరకొండను ఈరోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించిన ఈడీ, ఆయన నుంచి వివరాలు రాబట్టే పనిలో ఉంది.
ఇప్పటికే గత నెల 30న నటుడు ప్రకాశ్ రాజ్ ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండ విచారణకు హాజరవ్వడంతో కేసు మరింత ఉత్కంఠ రేపుతోంది.