LIVE
Mahendragiri Varahi: సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ అవుట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డివోషనల్ మిస్టరీ!  •  Railway UPdates: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 1 నుంచి మారిన తత్కాల్ రూల్స్.. ఆధార్ ఓటీపీ ఉంటేనే టికెట్!  •  Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!  •  US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!  •  TTS: నాష్‌విల్లేలో టీటీఎస్ పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం.. క్రీడాస్ఫూర్తికి తెలుగు సమాజం మద్దతు!  •  MATA: మాటా జాతీయ మహాసభల్లో క్రీడా విజేతలకు ఘన సన్మానం!  •  TCA: టీసీఏ ‘హ్యూస్టన్ ఐడల్’కు రంగం సిద్ధం.. ప్రవాస తెలుగు ప్రతిభకు భారీ వేదిక!  •  Peddi movie: ఆ 15 సీన్లు మా మనోభావాలను దెబ్బతీశాయి.. 'పెద్ది' సినిమా డైలాగులపై ఆదివాసీ సంఘాల ఫైర్!  •  Tourism: పాపికొండల పర్యాటకంపై పులి ప్రభావం.. భయంతో తగ్గిన సందర్శకుల రద్దీ!  •  Australia Updates: ఆస్ట్రేలియాలో పసుపు జాతర.. మెల్బోర్న్ మహానాడు ఘన విజయం, 1,200 మందితో రికార్డ్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Mahendragiri Varahi: సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ అవుట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డివోషనల్ మిస్టరీ!  •  Railway UPdates: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 1 నుంచి మారిన తత్కాల్ రూల్స్.. ఆధార్ ఓటీపీ ఉంటేనే టికెట్!  •  Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!  •  US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!  •  Peddi movie: ఆ 15 సీన్లు మా మనోభావాలను దెబ్బతీశాయి.. 'పెద్ది' సినిమా డైలాగులపై ఆదివాసీ సంఘాల ఫైర్!  •  Australia Updates: ఆస్ట్రేలియాలో పసుపు జాతర.. మెల్బోర్న్ మహానాడు ఘన విజయం, 1,200 మందితో రికార్డ్!  •  Janhvi Kapoor: జాన్వీ కపూర్ తప్పు లేదు.. ‘పెద్ది’ కెమెరా యాంగిల్స్ వివాదంపై నటి మేకప్ ఆర్టిస్ట్ సంచలన పోస్ట్!  •  AP News: గోదావరి రైతాంగానికి తీపి కబురు.. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మార్పునకు ప్రభుత్వం ముహూర్తం! రూ.124 కోట్లతో..  • 
Lifestyle

UPI: కంబోడియాలో యూపీఐ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్.. భారతీయ పర్యాటకులకు భారీ ఊరట!

UPI: కంబోడియా వెళ్లే భారతీయ పర్యాటకులకు ఇకపై ఖర్చుల నిర్వహణ మరింత సులభం కానుంది. భారతదేశం యొక్క యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత క్యూ ఆర్ (QR) చెల్లింపు సేవలను కంబోడియాలో అధికారికంగా ప్రారంభించారు.

AndhraPravasi News Desk 2 min read
UPI: కంబోడియాలో యూపీఐ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్.. భారతీయ పర్యాటకులకు భారీ ఊరట!

క్యాష్ అవసరం లేదు.. కంబోడియాలో యూపీఐతోనే చెల్లింపులు..

కంబోడియాలో భారతీయులకు డిజిటల్ చెల్లింపుల సౌకర్యం..

న్యూఢిల్లీ: కంబోడియా వెళ్లే భారతీయ పర్యాటకులకు ఇకపై ఖర్చుల నిర్వహణ మరింత సులభం కానుంది. భారతదేశం యొక్క యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత క్యూ ఆర్ (QR) చెల్లింపు సేవలను కంబోడియాలో అధికారికంగా ప్రారంభించారు. ఈ కొత్త వ్యవస్థతో భారతీయులు తమకు అలవాటైన డిజిటల్ చెల్లింపుల విధానాన్ని విదేశాల్లో కూడా ఉపయోగించుకునే అవకాశం లభించింది.

ఈ కార్యక్రమం తొలి దశలో భాగంగా కంబోడియా వ్యాప్తంగా ఉన్న 45 లక్షలకుపైగా వ్యాపార సంస్థల వద్ద భారతీయ పర్యాటకులు యూపీఐ ఆధారిత క్యూ ఆర్ కోడ్‌లను స్కాన్ చేసి నేరుగా చెల్లింపులు చేయవచ్చు. దీంతో నగదు తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు కరెన్సీ మార్పిడి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభించనుంది.

ప్రస్తుతం భారతీయులు కంబోడియాలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం కల్పించగా, తదుపరి దశలో ఈ సేవను ద్వైపాక్షికంగా విస్తరించనున్నారు. దీంతో కంబోడియా పౌరులు కూడా తమ దేశంలోని బ్యాంకింగ్ లేదా మొబైల్ చెల్లింపు యాప్‌ల ద్వారా భారత్‌లోని యూపీఐ క్యూ ఆర్ కోడ్‌లను స్కాన్ చేసి చెల్లింపులు చేయగలుగుతారు.

ఈ కొత్త విధానం భారతీయ పర్యాటకులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనుంది. నగదు భద్రతపై ఆందోళన లేకుండా షాపింగ్, హోటళ్లు, రెస్టారెంట్లు వంటి చోట్ల సులభంగా చెల్లింపులు చేసుకునే వీలు కలుగుతుంది. అంతేకాకుండా విదేశీ మారకపు విలువల్లో వచ్చే హెచ్చుతగ్గుల ప్రభావం కూడా కొంతవరకు తగ్గుతుంది.

కంబోడియాలోని స్థానిక వ్యాపారులకు కూడా ఈ వ్యవస్థ లాభదాయకంగా మారనుంది. భారతీయ పర్యాటకుల నుంచి డిజిటల్ చెల్లింపులు సులభంగా స్వీకరించే అవకాశం ఉండటంతో విక్రయాలు పెరిగే అవకాశం ఉంది. నగదు నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు లావాదేవీలు వేగంగా పూర్తయ్యే ప్రయోజనం కూడా కలుగుతుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

భారత్‌లోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంతర్జాతీయ విభాగమైన NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మరియు కంబోడియాకు చెందిన ఏసీఎల్ఈడీఏ బ్యాంక్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ సేవలను ప్రారంభించారు. కంబోడియా రాజధాని ఫ్నామ్ పెన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కంబోడియా నేషనల్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ చియా సెరే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

కంబోడియా చేరికతో ప్రస్తుతం యూపీఐ సేవలు అందుబాటులో ఉన్న దేశాల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇప్పటికే సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక దేశాల్లో యూపీఐ చెల్లింపులు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో యూపీఐ విస్తరణ ద్వారా భారతీయులకు విదేశీ ప్రయాణాలు మరింత సులభతరం చేయడమే కాకుండా, భారత డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

Be the first to react

More Coverage

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…

IRCTC: నకిలీ టికెట్ బుకింగ్‌లపై ఐఆర్‌సీటీసీ ఉక్కుపాదం.. 3 కోట్లకు పైగా అనుమానాస్పద ఖాతాలు డీయాక్టివేట్!

IRCTC: నకిలీ టికెట్ బుకింగ్‌లపై ఐఆర్‌సీటీసీ ఉక్కుపాదం.. 3 కోట్లకు పైగా అనుమానాస్పద ఖాతాలు డీయాక్టివేట్!

IRCTC: రైలు టికెట్లు పొందడంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నకిలీ బుకింగ్‌లపై వస్తున్న ఫిర్యా…