LIVE
Mahendragiri Varahi: సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ అవుట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డివోషనల్ మిస్టరీ!  •  Railway UPdates: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 1 నుంచి మారిన తత్కాల్ రూల్స్.. ఆధార్ ఓటీపీ ఉంటేనే టికెట్!  •  Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!  •  US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!  •  TTS: నాష్‌విల్లేలో టీటీఎస్ పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం.. క్రీడాస్ఫూర్తికి తెలుగు సమాజం మద్దతు!  •  MATA: మాటా జాతీయ మహాసభల్లో క్రీడా విజేతలకు ఘన సన్మానం!  •  TCA: టీసీఏ ‘హ్యూస్టన్ ఐడల్’కు రంగం సిద్ధం.. ప్రవాస తెలుగు ప్రతిభకు భారీ వేదిక!  •  Peddi movie: ఆ 15 సీన్లు మా మనోభావాలను దెబ్బతీశాయి.. 'పెద్ది' సినిమా డైలాగులపై ఆదివాసీ సంఘాల ఫైర్!  •  Tourism: పాపికొండల పర్యాటకంపై పులి ప్రభావం.. భయంతో తగ్గిన సందర్శకుల రద్దీ!  •  Australia Updates: ఆస్ట్రేలియాలో పసుపు జాతర.. మెల్బోర్న్ మహానాడు ఘన విజయం, 1,200 మందితో రికార్డ్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Mahendragiri Varahi: సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ అవుట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డివోషనల్ మిస్టరీ!  •  Railway UPdates: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 1 నుంచి మారిన తత్కాల్ రూల్స్.. ఆధార్ ఓటీపీ ఉంటేనే టికెట్!  •  Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!  •  US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!  •  Peddi movie: ఆ 15 సీన్లు మా మనోభావాలను దెబ్బతీశాయి.. 'పెద్ది' సినిమా డైలాగులపై ఆదివాసీ సంఘాల ఫైర్!  •  Australia Updates: ఆస్ట్రేలియాలో పసుపు జాతర.. మెల్బోర్న్ మహానాడు ఘన విజయం, 1,200 మందితో రికార్డ్!  •  Janhvi Kapoor: జాన్వీ కపూర్ తప్పు లేదు.. ‘పెద్ది’ కెమెరా యాంగిల్స్ వివాదంపై నటి మేకప్ ఆర్టిస్ట్ సంచలన పోస్ట్!  •  AP News: గోదావరి రైతాంగానికి తీపి కబురు.. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మార్పునకు ప్రభుత్వం ముహూర్తం! రూ.124 కోట్లతో..  • 
NRI Breaking

Australia Updates: ఆస్ట్రేలియాలో పసుపు జాతర.. మెల్బోర్న్ మహానాడు ఘన విజయం, 1,200 మందితో రికార్డ్!

Australia Updates: మెల్బోర్న్ మహానాడు 2026 ఘన విజయం – 1,200 మందికి పైగా హాజరు.. మెల్బోర్న్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన మెల్బోర్న్ మహానాడు 2026 కార్యక్రమం ఘనవిజయాన్ని సాధించింది. 1,200 మందికి పైగా తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, మద్దతుదారులు మరియు ప్రవాసాంధ్రులు ఈ మహాసభలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

AndhraPravasi News Desk 3 min read
australia melbourne mahanadu a great success record attendance of people
australia melbourne mahanadu a great success record attendance of people
  • NRI: ప్రవాసాంధ్రుల అచంచల మద్దతుతో మెల్బోర్న్ మహానాడు చారిత్రాత్మక విజయం: టీడీపీ ఎన్నారై విభాగం..

  • Politics: ఖండంతరాల్లోనూ తగ్గని క్రేజ్.. ఏపీ నేతల సమక్షంలో మెల్బోర్న్ మహానాడు సూపర్ హిట్!

Australia Updates: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం తాజాగా పసుపు రంగు పులుముకుంది. ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘మెల్బోర్న్ మహానాడు 2026’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగి, సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. తమ సొంత గడ్డ, సొంత పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఏకంగా 1,200 మందికి పైగా తెలుగు ప్రజలు ఈ మహాసభకు తరలివచ్చారు. మెల్బోర్న్ చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద మహానాడు కార్యక్రమంగా నిలిచిపోయింది. 

ఈసారి జరిగిన మెల్బోర్న్ మహానాడుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య అతిథులుగా పలువురు ప్రజాప్రతినిధులు హాజరవడం విశేషం. వారు ఎవరో ఇక్కడ చూద్దాం:

  • శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు (విజయనగరం ఎంపీ)

  • శ్రీ ఎన్. అమర్నాధ్ రెడ్డి గారు (పలమనేరు ఎమ్మెల్యే)

  • శ్రీ హరీష్ బాలయోగి గారు (అమలాపురం ఎంపీ)

  • శ్రీమతి కావలి గ్రీష్మ గారు (ఎమ్మెల్సీ)

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండే ఈ నేతలంతా మెల్బోర్న్ రావడం, ప్రవాసాంధ్రులతో నేరుగా మాట్లాడటంతో అక్కడి తెలుగువారిలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలను నేతలు ఈ వేదికపై పంచుకున్నారు.

కావలి గ్రీష్మ గారు (ఎమ్మెల్సీ) ప్రసంగం – ముఖ్యాంశాలు:
వైసీపీ సోషల్ మీడియా బలంగా పనిచేస్తోందని, ప్రజల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కావలి గ్రీష్మ గారు తెలిపారు.
ఆ అబద్ధపు ప్రచారాలను సమర్థంగా ఎదుర్కొని నిజాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
ప్రతిపక్షం చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టి, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం చేస్తున్న పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

కలిశెట్టి అప్పలనాయుడు గారు ప్రసంగ ముఖ్యాంశాలు:
తెలుగువారందరిని ఒక తాటి పైకి తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని కలిశెట్టి అప్పలనాయుడు గారు పేర్కొన్నారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ గారు నిలిచారని ఆయన కొనియాడారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రబిందువుగా అమరావతి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని అన్నారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి, మరియు రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

అమర్నాధ్ రెడ్డి గారు ప్రసంగ ముఖ్యాంశాలు:
మెల్బోర్న్‌లో ఇంత భారీ స్థాయిలో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మెల్బోర్న్ టీడీపీ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో వారి కృషి, సమన్వయం, అంకితభావాన్ని కొనియాడారు.
తెలుగు ప్రజలు గర్వంగా తల ఎత్తుకుని జీవించడానికి కారణం ఎన్టీఆర్ గారు అని పేర్కొన్నారు.
పేదలకు సహాయం చేయడం, ప్రజలకు అండగా నిలవడం ద్వారా ఎన్టీఆర్ గారు మహానేతగా నిలిచారని తెలిపారు.

హరీష్ బాలయోగి గారు ఎంపీ అయిన తరువాత తన మొదటి అంతర్జాతీయ మహానాడు మెల్బోర్న్ మహానాడు కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మెల్బోర్న్‌లో టిడిపి కార్యకర్తలు, తెలుగు సమాజం అందరూ తనను ఘనంగా ఆహ్వానించారని తెలిపారు.
మెల్బోర్న్ మహానాడులో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నారా లోకేష్ గారు తనను స్వంత అన్నయ్యలా చూసుకుంటారని చెప్పారు. అలాగే బంగారు కోనసీమను అభివృద్ధి చేయడం తన కల అని కూడా తెలిపారు.

విజయానికి బలం.. టీడీపీ సైనికుల శ్రమ!
సాధారణంగా పరాయి దేశంలో ఇంత పెద్ద ఎత్తున, వేల మందితో ఒక ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. దీని వెనుక టీడీపీ మెల్బోర్న్ బృందం, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించారు.

Australia melbourne mahanadu nri tdp karyakartala kolaahalam

కార్యక్రమం ముగిసిన తర్వాత టీడీపీ మెల్బోర్న్ టీమ్ మాట్లాడుతూ.. "ఇంతటి భారీ విజయం మా అభిమానులు, మద్దతుదారుల అంకితభావం వల్లే సాధ్యమైంది. తెరవెనుక ఉండి ప్రతి చిన్న విషయాన్ని చూసుకున్న వాలంటీర్లు, ఆర్థికంగా అండగా నిలిచిన స్పాన్సర్లు, వచ్చిన జనాలను తమ ఆటపాటలతో అలరించిన కళాకారులకు పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు" అంటూ ఎమోషనల్ గా థాంక్స్ చెప్పారు.

తెలుగు సమాజం ఐక్యతకు నిదర్శనం
ఈ మహానాడు కేవలం ఒక రాజకీయ సభలా కాకుండా, ఆస్ట్రేలియాలో ఉంటున్న తెలుగువారంతా ఒకచోటికి చేరి జరుపుకున్న ఒక పెద్ద పండుగలా సాగింది. 1,200 మందికి పైగా హాజరు కావడం అనేది మెల్బోర్న్ తెలుగు కమ్యూనిటీ చరిత్రలోనే ఒక రికార్డు.

తెలుగుదేశం కుటుంబం యొక్క ఐక్యతకు, సంఘీభావానికి ఈ ప్రోగ్రామ్ ఒక ఉదాహరణగా నిలిచింది. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహం, ఇదే నమ్మకంతో పార్టీకి, సొంత రాష్ట్రానికి అండగా నిలబడతామని ప్రవాసాంధ్రులు ఈ వేదిక ద్వారా చాటిచెప్పారు.

సొంత ఊరికి దూరంగా, ఏడు సముద్రాల అవతల ఉన్నా కూడా తెలుగు సంస్కృతిని, తాము నమ్మిన సిద్ధాంతాలను మర్చిపోకుండా.. ఇంతటి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న మెల్బోర్న్ తెలుగు తమ్ముళ్లను మెచ్చుకోకుండా ఉండలేం. 'జై తెలుగుదేశం' నినాదాలతో మెల్బోర్న్ వేదిక మారుమోగిపోయింది. భవిష్యత్తులోనూ ఇలాంటి మరెన్నో విజయవంతమైన కార్యక్రమాలతో మన తెలుగువారు ముందుకు సాగాలని ఆశిద్దాం..

Be the first to react

More Coverage

TTS: నాష్‌విల్లేలో టీటీఎస్ పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం.. క్రీడాస్ఫూర్తికి తెలుగు సమాజం మద్దతు!

TTS: నాష్‌విల్లేలో టీటీఎస్ పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం.. క్రీడాస్ఫూర్తికి తెలుగు సమాజం మద్దతు!

TTS: అమెరికాలోని నాష్‌విల్లే నగరంలో టెన్నెస్సీ తెలుగు సమితి (TTS) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెన్స్ డబు…

US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!

US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!

US Job Market: అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన ఓ మహిళ, తాను నడుపుతున్న ఇండియన్ రెస్టారెంట్‌ల…

USA UPdates: ఉపాధి కోసం వెళ్లి విగతజీవిగా.. అమెరికాలో లూటీ ముఠా జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడి మృతి!

USA UPdates: ఉపాధి కోసం వెళ్లి విగతజీవిగా.. అమెరికాలో లూటీ ముఠా జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడి మృతి!

USA UPdates: ఉపాధి నిమిత్తం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నార్త…