ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. 2024 ఎన్నికల సమయంలో పలువురు సీనియర్లు కూటమి కోసం ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసారు. వారిలో పలువురికి ఎమ్మెల్సీ సీట్లు.. మరి కొందరికి నామినేటెడ్ పదవుల పైన హామీ ఇచ్చారు. మూడు పార్టీల నుంచి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా నామినేటెడ్ పదవులను ప్రకటించారు. కాగా, మూడో విడత జాబితా సిద్దమైంది. మూడు పార్టీల నేతలకు ఇందులో అవకాశం దక్కనుంది. ఇక, ఈ లిస్టులో భారీగా పోస్టుల ఖరారు చేసినట్లు సమాచారం. మూడో జాబితాలో కూటమి ప్రభుత్వం మూడో విడత నామినేటెడ్ పదవుల జాబితా ఉగాది నాడు విడుదల చేసేందు కు సిద్దం అవుతోంది. ఈ మేరకు కసరత్తు తుది దశకు చేరింది. దాదాపు 60 వ్యవసాయ మార్కెట్ కమిటీ లతో పాటుగా మరో 60 కీలక కార్పోరేషన్లు .. 21 ఆలయ పాలకవర్గాలకు నియామకాలు పూర్తి చేయనున్నారు. మహానాడు నాటికి పదవుల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. టీడీపీ నుంచి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
ఇది కూడా చదవండి: మూడో విడత నామినేటెడ్ పోస్టులు ఖరారు.. ఆశావాకుల ఆసక్తి! ఆ రోజున జాబితా విడుదల!
జనసేన, బీజేపీ నుంచి పదవులు ఆశిస్తున్న వారి లిస్టులు సీఎం చంద్రబాబుకు చేరాయి. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన పవన్, పురందేశ్వరి తో చంద్రబాబు చర్చించారు. ఈ నెల 30న మూడో జాబితా విడుదల దిశగా రంగం సిద్దం చేస్తున్నారు. తుది కసరత్తు నామినేటెడ్ పోస్టుల కోసం దాదాపు 60 వేల దరఖాస్తులు వచ్చాయి. అయితే, కేవలం వ్యవసాయ మార్కెట్ కమిటీలనే ఈ జాబితాలో ఖరారు చేస్తారా.. కార్పోరేషన్ ఛైర్మన్లను ప్రకటిస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. రెండో విడత భర్తీ ప్రక్రియ నవంబరులో జరిగింది. 59 మందితో రెండో జాబితా విడుదలైంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తొలి, రెండో విడతల్లో సుమారు 150 మంది నేతలకు పదవులు ఖరారు చేసారు. ఇక..మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై నాలుగు నెలలుగా కసరత్తు జరుగుతున్నా సామాజిక సమీకరణలు.. కూటమి పార్టీల డిమాండ్లతో ప్రక్రియ ఆలస్యం అవుతోంది. లిస్టులో ఉన్నదెవరు అంటే టీడీపీ టిక్కెట్లు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యేలు మరియు మంత్రులు అదే విధంగా జనసేన నుంచి పలువురు పదవులు కోరుతూ తమ పార్టీ అధినేతను కలిసారు. బీజేపీ నుంచి ఇప్పటికే జాబితాను సీఎం చంద్రబాబుకు ఇవ్వటం తో ఈ రెండు పార్టీలకు ఎన్ని పదవులు ఇవ్వాలనే అంశం పైన తుది చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు ప్రతీ సారి కార్యకర్తల సమావేశంలో.. రెండో విడత పోస్టుల భర్తీ ఉంటుంద ని .. అందరికీ అవకాశం కల్పిస్తామని చెబుతూ వస్తున్నారు. దీంతో, మూడో విడతలో అవకాశం ఎవరికి దక్కుతుందనేది కూటమిలో ఆసక్తిగా మారుతోంది. నిన్న ప్రచురించిన తెలుగు వన్ ఇండియా కథనంలో పేర్కొన్నారు..
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!
కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యే వ్యాఖ్యల ప్రస్తావన! ఎక్కువ ఖర్చు లేకుండా..
చవక బాబు.. చవక.. విమాన టికెట్లపై 30 శాతం ప్రత్యేక డిస్కౌంట్! ఎప్పటి నుంచి అంటే?
కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు.. విషమం.?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రజల నుంచి వినతులు రావడంతో.. వారందరికీ బంపరాఫర్!
వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఎప్పటివరకంటే?
తీవ్ర ఆవేదన.. సీనియర్ నటుడు, పవన్ కల్యాణ్ గురువు కన్నుమూత! ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల!
వైసీపీకి ఊహించని షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు.. అరెస్ట్ తప్పదా..?
పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త! ఇకపై పింఛన్ కోసం స్వగ్రామం వెళ్లనక్కర్లేదు!
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. అట్టడుగు వర్గాల వారికి మరింత చేయూత.. ఉగాది నుంచి P4.!
వైసీపీ బిగ్‌షాక్.. బోరుగడ్డకు బిగుస్తున్న ఉచ్చు.! మరో కేసులో.. అప్పటి నుంచి జైల్లోనే.!
BSNL మరో క్రేజీ ప్లాన్.. ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం.! అతి తక్కువ ధరలో.. వివరాలు ఇవిగో.!
తమిళనాడులోకి జనసేన ఎంట్రీపై.. ఇక స్టాలిన్ పనైపోయినట్టే.! సినీ నటులు రాజకీయాల్లో..
ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!
బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రభాస్, బాలయ్య, గోపీచంద్ పైనా ఫిర్యాదు! తెలుగు రాష్ట్రాల్లో కలకలం..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: