ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన రెండవ రోజు బుధవారం ఏపీ సచివాలయం (AP Secretariat)లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ (Collectors Conference) జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో ఎమ్మెల్యే కూనంనేని (MLA Koonamneni)చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సిఎంగా ఉన్న సమయంలో టూరిజం (Tourism)పై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సభలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రస్తావించారు. ‘ఇప్పుడు సమాజంలో ఏ ఇజం లేదు... ఉన్నదంతా టూరిజమే’ అని ఆనాడు చంద్రబాబు అనేవారు అంటూ ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు ‘నాడు ఇజంపై చెప్పిన మాటే నిజం’ అంటూ తెలంగాణ సభలో ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యానించారు. పత్రికలో వచ్చిన ఆ వార్తను సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సుల్లో టూరిజం అంశంపై మాట్లాడుతూ ప్రస్తావించారు. ఏ ఇజం లేదు అని తాను నాడు అంటే కమ్యూనిస్టులు తనపై విరుచుకుపడ్డారని... విమర్శలు చేశారని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో శాసన సభ్యుడు మాట్లాడతూ ఖర్చు లేని ఇజం టూరిజమే అంటూ ఇప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. తాను చేసిన మాటలను, తన ఆలోచనలను అర్ధం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది అంటూ నవ్వుతూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. కాంగ్రెస్ పార్టీ నేతలు మరికొందరి ఇళ్లపైనా రెయిడ్.!
అయితే ఇప్పుడు అంత సమయం లేదని...త్వరగా ప్రాజెక్టులు తెచ్చి... ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని అన్నారు. రాష్ట్రంలో ఇటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్దికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ది ప్రాజెక్టులపై శ్రద్ద పెట్టాలని సూచించారు. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. ఎకానమీ పెరిగి...ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాథి కల్పించే రంగం టూరిజం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రతి జిల్లాలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని వాటికి అనుగుణంగా పనిచేస్తే టూరిజం పెద్ద ఉపాధి మార్గం అవుతుందన్న చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కాగా రెండవ రోజు బుధవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మిగిలిన జిల్లాల డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్‌పై జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. అనంతరం ఐదు నిమిషాల పాటు చర్చించనున్నారు. తర్వాత జోనల్ ఇన్చార్జి ఆఫీసర్స్‌కు ప్రజెంటేషన్ ఇస్తారు. ఆయా ప్రజెంటేషన్‌లపై సూచనలు, కలెక్టర్లకు దిశా నిర్దేశం చేస్తారు. సీసీఎల్ఏ కమిషనర్ చేతుల మీదుగా ముగింపు కార్యక్రమం ఉంటుంది. అనంతరం సీనియర్ కలెక్టర్ ఓట్ ఆఫ్ థాంక్స్ తెలియజేయనున్నారు.
ఇది కూడా చదవండి: మూడో విడత నామినేటెడ్ పోస్టులు ఖరారు.. ఆశావాకుల ఆసక్తి! ఆ రోజున జాబితా విడుదల!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చవక బాబు.. చవక.. విమాన టికెట్లపై 30 శాతం ప్రత్యేక డిస్కౌంట్! ఎప్పటి నుంచి అంటే?
కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు.. విషమం.?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రజల నుంచి వినతులు రావడంతో.. వారందరికీ బంపరాఫర్!
వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఎప్పటివరకంటే?
తీవ్ర ఆవేదన.. సీనియర్ నటుడు, పవన్ కల్యాణ్ గురువు కన్నుమూత! ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల!
వైసీపీకి ఊహించని షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు.. అరెస్ట్ తప్పదా..?
పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త! ఇకపై పింఛన్ కోసం స్వగ్రామం వెళ్లనక్కర్లేదు!
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. అట్టడుగు వర్గాల వారికి మరింత చేయూత.. ఉగాది నుంచి P4.!
వైసీపీ బిగ్‌షాక్.. బోరుగడ్డకు బిగుస్తున్న ఉచ్చు.! మరో కేసులో.. అప్పటి నుంచి జైల్లోనే.!
BSNL మరో క్రేజీ ప్లాన్.. ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం.! అతి తక్కువ ధరలో.. వివరాలు ఇవిగో.!
తమిళనాడులోకి జనసేన ఎంట్రీపై.. ఇక స్టాలిన్ పనైపోయినట్టే.! సినీ నటులు రాజకీయాల్లో..
ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!
బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రభాస్, బాలయ్య, గోపీచంద్ పైనా ఫిర్యాదు! తెలుగు రాష్ట్రాల్లో కలకలం..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: