ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “తల్లికి వందనం” పథకం అమలుకు భారీగా కసరత్తు చేపట్టింది. ఈ నెలలోనే పథకం ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, లబ్ధిదారుల తుది ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. పాఠశాల విద్యాశాఖ నుంచి సేకరించిన సమాచారం మరియు గ్రామ, వార్డు సచివాలయాల డేటాను అనుసంధానించి తుది జాబితాను ఖరారు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని జూన్ 12 లేదా 14వ తేదీన ప్రారంభించేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. 2025-26 బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ. 9407 కోట్లను కేటాయించగా, 69.16 లక్షల మంది విద్యార్థుల తల్లులు లబ్ధిదారులుగా గుర్తించినట్టు సమాచారం. 75 శాతం హాజరు నిబంధనతో పాటు, విద్యాశాఖ, సచివాలయ సిబ్బంది సమన్వయంతో తుది జాబితా రూపొందించబడుతోంది.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఆదాయ పన్ను చెల్లించేవారు, తెల్లరేషన్ కార్డు లేని వారు, 300 యూనిట్లకంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే కుటుంబాలు, కారు కలిగిన వారు, నగర ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకంటే ఎక్కువ స్థలమున్నవారికి పథకం వర్తించదని సమాచారం. ఈ నిబంధనలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మొదట రెండు విడతల్లో అమలు చేయాలన్న ఆలోచన వచ్చినా, ఇప్పుడు ఒకే విడతలో నిధుల విడుదలపై ప్రభుత్వం దృష్టి సారించింది. తుది జాబితా ఖరారైన తరువాతే పథకం అమలు తేదీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..
ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
ఏపీలో ఆ ఉద్యోగులకు బదిలీలు! త్వరలో ఉత్తర్వులు జారీ!
ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు.. వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది! షర్మిల ఫైర్..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.50 లక్షల విరాళం...
ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..
ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!
ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!
ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: