ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (Electric car company Tesla) భారత్ (India) మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నెల జూలై 15న ముంబైలో (Mumbai) మొదటి షోరూమ్ (Showroom) ప్రారంభించబోతోంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ (Jio World Center) లో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా, టెస్లా భారత్ వ్యాప్తంగా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు మొదటి అడుగు వేసింది. ఇప్పటికే చైనాలోని షాంఘై (Shanghai) ఫ్యాక్టరీ నుంచి వై మోడల్ కార్లను (Model Y Cars) దిగుమతి చేసింది. భవిష్యత్తులో డిమాండ్ (Demand) బట్టి ఢిల్లీలో (Delhi) కూడా షోరూమ్ స్థాపించే యోచనలో ఉంది.
ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌గా... టైమింగ్స్ మారాయి!
ఇండియాలో ఎంట్రీకి టెస్లా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే, లగ్జరీ కార్లపై ఉన్న అధిక దిగుమతి సుంకాలు (Import Duties) కారణంగా ఇప్పటివరకు ముందుకురాలేదు. కానీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా CEO ఎలాన్ మస్క్ (Elon Musk) తో జరిపిన వాణిజ్య చర్చల తర్వాత పరిస్థితులు మారాయి. కేంద్ర ప్రభుత్వం దిగుమతులపై పన్నులను తగ్గించడమే కాకుండా, దేశీయంగా కార్ల తయారీ (Local Manufacturing) కోసం గడువును పొడిగించింది. ఈ చర్యల వల్ల భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశానికి అడ్డంకులు తొలిగిపోయాయి.
ఇది కూడా చదవండి: Employment News: ఆ ఉద్యోగస్తులకు ప్రభుత్వం శుభవార్త! కేబినెట్ సబ్ కమిటీ పలు మార్లు!
ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (Bandra Kurla Complex - BKC) లో 4,000 చదరపు అడుగుల షోరూమ్‌ను నెలకు రూ. 35 లక్షల అద్దెకు టెస్లా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టెస్లా వై మోడల్ (Model Y) ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అమ్మకాలు నమోదుచేస్తోంది. ఈ కారు ధర పన్నులు, బీమా (Insurance) కలిపి సుమారుగా రూ. 48 లక్షలపైనే ఉండనుంది. అయితే, దేశీయ ఉత్పత్తి పెరిగినప్పుడు ఈ ధరలు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Vande Bharat: తిరుపతికి మరో వందే భారత్ లైన్ క్లియర్! రూట్ ఫిక్స్.. షెడ్యూల్ ఇదే!
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టెస్లా ప్రవేశం భారత ఆటోమొబైల్ రంగాన్ని (Automobile Sector) మరింత ప్రోత్సహించనుంది. స్థానిక ఉత్పత్తిని పెంచడం ద్వారా, మధ్య తరగతి వినియోగదారులకూ టెస్లా కార్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా టెస్లా ఆటోమొబైల్ మార్కెట్‌ను మార్చినట్లు, భారత్‌లో కూడా కొత్త ఒరవడిని తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Amaravati Express Highway: అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Godavari River: గంట గంటకు పెరుగుతున్న గోదావరి... లోతట్టు ప్రాంతాల ప్రజలుకు హెచ్చరిక!
Visa: అమెరికా వీసా దరఖాస్తుదారులకు షాక్... అదనపు ఫీ ఎంత అంటే!
Substations: ఆ జిల్లాకు మూడు కొత్త సబ్ స్టేషన్లు మంజూరు! ఎస్‌ఈ శ్రవణ్ కుమార్ ప్రకటన!
Job offers: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్లకు గ్లోబల్ అవకాశాలు! శిక్షణతో పాటు ఉద్యోగం!
RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!
Hero Prabhas: ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్! కారణం తెలిస్తే అవాక్కవుతారు!
Donald Trump: ట్రంప్ కొత్త బిల్లు ఎఫెక్ట్..! భారతీయ విద్యార్థులకు, టూరిస్టులకు అమెరికా షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: