Kuwait Employment: కువైట్ లో 2030 నాటికి ఆ విదేశీ ఉద్యోగులకు బై బై! ప్రభుత్వం సంచలన నిర్ణయం! వారు దేశం విడిచి పోవాల్సిందే!

తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. రాబోయే వెయ్యి సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని నమూనా నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

Fake app: సీఆర్పీఎఫ్ సిబ్బందిపై సైబర్ వల..! ఫేక్ యాప్‌తో సీక్రెట్ డేటా టార్గెట్!

ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 8 లైన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని నిర్ణయించారు. ఇది పూర్తి అయితే, హైదరాబాద్–విజయవాడ దూరం 70 కి.మీ. తగ్గి, ప్రయాణ సమయం ఒక గంట తగ్గనుంది.

Coolie: రజినీకాంత్ కూలీ.. ఓటీటీ రిలీజ్‌కు ఎదురుచూపులు!

అంతేకాకుండా, ఫ్యూచర్ సిటీని మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేయాలని భావిస్తూ, సంబంధిత ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి పంపారు. రీజినల్ రింగ్ రోడ్ వద్ద మెదక్, చౌటుప్పల్ లేదా ఖమ్మం వద్ద రెండు డ్రై పోర్టులు ఏర్పాటుచేయాలని కూడా యోచిస్తున్నారు. ఈ అనుసంధానాలు జరిగితే జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి ఊతం లభించి, బహుళజాతి కంపెనీలు, పెట్టుబడిదారులు పెద్దఎత్తున ఆకర్షితులయ్యే అవకాశముంది.

SUV: కొత్త SUV కారు వచ్చేస్తుందోచ్! అద్భుత ఫీచర్లు... అదిరిపోయే లుక్ తో! మైలేజ్ చూస్తే మైండ్ బ్లాక్!

ఇక రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్” ను సిద్ధం చేస్తోంది. 2047 నాటికి రాష్ట్ర ఆర్థికవ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ రూపొందించారు. ఇందులో రాష్ట్రాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలుగా విభజించి, వాటిని వరుసగా సర్వీస్, ఇండస్ట్రీయల్, వ్యవసాయ కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న, సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా విడుదల చేయనున్నారు.

Chief Minister programs: ఆయనకు సహాయ మంత్రి హోదా! ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం! ముఖ్యమంత్రి కార్యక్రమాలకు...

రహదారులు, పోర్టులు, డ్రై పోర్టులు, రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అమలు అయితే, తెలంగాణ జాతీయ–అంతర్జాతీయ వాణిజ్య హబ్‌గా మారి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, రాష్ట్రానికి వేగవంతమైన ఆర్థికాభివృద్ధి లభించనున్నాయి.

Murder case: వివేకా హత్యకేసు విచారణలో కీలక ట్విస్టు..! బెయిల్ రద్దుపై సమీక్ష!
Trending chinese girl: ఆరేళ్లుగా జుట్టు తినే అలవాటు.. ప్రమాదంలో ప్రాణం.. తల్లిదండ్రులు నిర్లక్ష్యం!
RGV Nag: డైరెక్టర్ గా నాకు నాగార్జున జన్మనిచ్చారు.. RGV!
Trending AI Tools: టాప్ ట్రెండింగ్ AI టూల్స్ ఇవే! వీటి గురించి మీకు తెలుసా? పూర్తి జాబితా...
Telngana: తెలంగాణా ప్రభుత్వ భూముల విక్రయం! మార్కెట్‌లో కొత్త రికార్డులు!