Bhagavad Gita : మంచినే చూడండి మంచినే వినండి.. అన్నిటిలో నేనే ఉన్నాను.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -38!

హీరో శర్వానంద్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవాలి ప్రేక్షకులను విభిన్నమైన పాత్రలతో  అలరించే ఆయన ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటారు. ఈసారి కూడా మరొక కొత్త జానర్‌లో అడుగుపెట్టారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చినట్లు సమాచారం. గతంలో ఈ బ్యానర్‌తో రన్ రాజా రన్, మహానుభావుడు, ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి హిట్స్ ఇచ్చిన శర్వానంద్‌కు, యూవీ క్రియేషన్స్‌ ఒక సెంటిమెంట్‌లా  మారిందనే చెప్పుకోవాలి.

Israeli : గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 97 మంది మృతి.. రక్తపాతం మరోసారి!

శర్వానంద్‌ 36వ చిత్రంగా రెండు సంవత్సరాల క్రితం  పూజా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటికీ, ఇప్పటివరకు పెద్దగా అప్‌డేట్లు రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో విడుదల చేసిన పోస్టర్‌ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ధూళి కమ్మిన రోడ్డుపై బైక్ రేస్ సీన్‌తో కూడిన ఆ పోస్టర్‌లో హీరో జాకెట్‌పై S36 లోగో కనిపించింది. అప్పుడే ఇది స్పోర్ట్స్‌ డ్రామా అని స్పష్టమైంది. ఇక తాజాగా దీపావళి సందర్భంగా చిత్రానికి 'బైకర్' (Biker) అని టైటిల్‌ ఫిక్స్ చేయడంతో అభిమానుల్లో మరింత హైప్‌ పెరిగింది.

పుదీనా-అల్లం టీ మ్యాజిక్.. జీర్ణ సమస్యల నుంచి కీళ్ల నొప్పుల వరకు.. ఎన్నో వ్యాధులకు చెక్!

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది అభిలాష్ రెడ్డి కంకర ఆయన తన తొలి ప్రాజెక్ట్ మా నాన్న సూపర్ హీరో తో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే వెబ్ సిరీస్ లూజర్ తో కూడా మంచి పేరు సంపాదించిన అభిలాష్ రెడ్డికి శర్వానంద్‌తో చేయబోతున్న ఈ రెండో ప్రయత్నం చాలా ఆసక్తికరంగా మారింది. కథ పరంగా కూడా ఇది భిన్నంగా ఉండబోతోందని టాక్.

బీపీ అదుపులో ఉండాలంటే.. ఉప్పుకు బదులు ఈ 5 ఆహారాలు తీసుకోండి! ఇలా చేసి చూడండి!

ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తోంది. వీరిద్దరి జంట తెరపై కొత్తగా కనిపించబోతోంది. ట్రెండీ ట్యూన్స్‌కి పేరుగాంచిన జిబ్రాన్‌ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను జె. యువరాజ్‌ చేపట్టారు. ఎడిటింగ్‌ను అనిల్‌కుమార్‌ పి చేయగా, ఆర్ట్‌ డైరెక్షన్‌ను ఏ. పన్నీర్‌సెల్వం చూసుకుంటున్నారు.

Waste to Energy: తిరుపతిలో చెత్తతో విద్యుత్తు ఉత్పత్తి..! 12 మెగావాట్ల ప్రాజెక్ట్‌కి శ్రీకారం..!

ఇది మూడు తరాల కుటుంబ కథను ఆధారంగా చేసుకుని, 1990ల నాటి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ జర్నీగా రూపొందుతోంది. ప్రేమ, కుటుంబ విలువలు, క్రీడా స్ఫూర్తి అన్నీ కలిపిన ఈ కథలో శర్వానంద్‌ ప్రొఫెషనల్ బైక్ రైడర్‌గా కనిపించనున్నారు. తన కెరీర్‌లో తొలిసారిగా ఇలాంటి పాత్రలో నటిస్తుండటంతో, అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బైకర్ సినిమా శర్వానంద్ కెరీర్‌లో  సూపర్ హిట్ గా నిలిచిద్దని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Picture Puzzle: పిక్చర్ పజిల్ ఛాలెంజ్! 25 సెకన్లలో మూడు తేడాలు కనిపెట్టగలరా!
APRTC ఉద్యోగులకు దీపావళి కానుక..! పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
ఏపీ యువతకు ఆస్ట్రేలియా ప్రమాణాలు.. TAFE NSWతో మంత్రి లోకేశ్ కీలక ఒప్పందం!
Ap Government: ఏపీ ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి బోనస్..! 3.64% పెంపుతో... కొత్త డీఏ, బకాయిలు విడుదల..!
Herbal Tea: ఉదయాన్నే వీటితో టీ తీసుకుంటే... ఇక ఆ సమస్యలకు చెక్!