AndhraPradesh: ఆంధ్ర రాష్ట్రానికి అదిరే న్యూస్ వవచ్చేసింది. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త జోన్‌లో నాలుగు ప్రధాన రైల్వే డివిజన్లు ఉన్నాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు ఉండనున్నాయి. రైల్వే శాఖ నుంచి వచ్చిన ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజలు ఉబ్బితబ్బై పోతున్నారు. తమకు మరో గొప్ప అరుదైన గౌరవాన్ని ఈ నిర్ణయం తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. వీరిలో పాటు.. ఈ నిర్ణయం పట్ల రాజకీయ వర్గాలు, సామాజిక కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త రైల్వేజోన్ ఏర్పాటుతో విశాఖపట్నం ప్రాంతంలో రైలు ప్రయాణం మరింత మెరుగవ్వడమే కాకుండా.. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభించినట్లైంది. రైల్వే శాఖ అభివృద్ధి పనులకు మరింత నిధులు కేటాయించడంతో ఇక్కడి రైల్వే నెట్‌వర్క్ విస్తరణకు కూడా మరింత అవకాశం ఉండనుంది.
ఇది కూడా చదవండి: నేడు (6/2) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగవ్వడంతో పాటు.. కొత్తగా ఉద్యోగావకాశాలు కూడా పెరగనున్నాయి. రైల్వే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల విషయంలో ఈ సారి 17 జోన్లతో పాటు.. ఈ జోన్ కూడా యాడ్ అవుతుంది. ఇక నుంచి ఈ జోన్ల వారీగా ఖాళీ పోస్టులను రిక్రూట్‌మెంట్‌లో చూపెట్టునున్నారు. వీటితో పాటు.. అవుడ్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా అదనంగా ఈ జోన్ ఏర్పాటుతో భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. “ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల నేడు సాకారమైంది. విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ రావడం చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం మరో విజయాన్ని సొంతం చేసుకుందని ఆయన అన్నారు. అలాగే.. వాల్తేరు డివిజన్‌ను విశాఖ డివిజన్‌లో విలీనం చేయడాన్ని ఆయన హర్షించారు. ఈ జోన్ ఏర్పాటుతో రైలు మార్గాల అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయని.. భవిష్యత్‌లో మరిన్ని రైలు ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆశిస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో లోకేశ్ భేటీ! ఈ పథకం కింద రూ. 5,684 కోట్లు మంజూరు!
ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగిద్దాం - మంత్రి నారా లోకేశ్! ఢిల్లీ పర్యటనలో కీలక ప్రకటన!
కేంద్రమంత్రి తో మంత్రి నారా లోకేశ్ భేటీ! ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన! నాలుగు గంటలకు పైగా విమానాశ్రయంలో..
వైసీపీ నేతలకు బంపర్ ఆఫర్! ఇది నిరూపిస్తే 10 కోట్ల రూపాయలు మీ సొంతం! ఛాలెంజ్ విసిరిన మంత్రి లోకేష్!
భవిష్యత్‌లోనూ ఇదే పంథా కొనసాగిద్దాం! త్వరలో కేంద్ర మంత్రి వైష్ణవ్ రాష్ట్రంలో.. కూటమి ఎంపీలతో మంత్రి!
ఉచిత గ్యాస్ సిలిండర్‌పై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! ఆ డేట్‌లోగా బుక్ తప్పనిసరి?
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్! తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా! సరికొత్త ప్లాన్!
ఏపీలో రూ.96 వేల కోట్లతో భారీ పరిశ్రమ! కేంద్రం కీలక ప్రకటన!
ఏపీ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీల ఛైర్మన్లు నియామకం! కీలక నోటిఫికేషన్ జారీ!
ఓరీ దేవుడా.. ఒకే అబ్బాయితో ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో.. రోడ్డుపై విద్యార్థినుల ఫైట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: