శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన విమానం సాంకేతిక కారణాలతో క్యాన్సిల్ అయింది. కానీ, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. నాలుగు గంటలకు పైగా విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైట్ క్యాన్సిల్ అయిన విషయాన్ని కూడా తమకు ఆఖరి నిమిషంలో చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం 5.30 గంటలకు అలియన్స్ ఎయిర్‌లైన్స్ కు చెందిన 91877 విమాన సర్వీసు 47 మంది ప్రయాణికులతో తిరుపతికి వెళ్లాల్సి ఉంది. అయితే, విమానంలో తలెత్తిన సాంకేతికలోపం కారణంగా రద్దు చేశారు. అప్పటికే ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికులు ఈ విషయం తెలియడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల దర్శన సమయం కూడా దాటిపోతుందని, అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీ నేతలకు బంపర్ ఆఫర్! ఇది నిరూపిస్తే 10 కోట్ల రూపాయలు మీ సొంతం! ఛాలెంజ్ విసిరిన మంత్రి లోకేష్!
భవిష్యత్‌లోనూ ఇదే పంథా కొనసాగిద్దాం! త్వరలో కేంద్ర మంత్రి వైష్ణవ్ రాష్ట్రంలో.. కూటమి ఎంపీలతో మంత్రి!
ఉచిత గ్యాస్ సిలిండర్‌పై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! ఆ డేట్‌లోగా బుక్ తప్పనిసరి?
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్! తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా! సరికొత్త ప్లాన్!
ఏపీలో రూ.96 వేల కోట్లతో భారీ పరిశ్రమ! కేంద్రం కీలక ప్రకటన!
ఏపీ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీల ఛైర్మన్లు నియామకం! కీలక నోటిఫికేషన్ జారీ!
ఓరీ దేవుడా.. ఒకే అబ్బాయితో ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో.. రోడ్డుపై విద్యార్థినుల ఫైట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: