దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన NEET PG 2025 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఫలితాలను మంగళవారం (ఆగస్ట్ 19) సాయంత్రం అధికారికంగా ప్రకటించింది.
ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. NEET PG 2025 పరీక్ష ఆగస్టు 3న దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో ఒకే షిఫ్ట్‌లో నిర్వహించబడింది.
ఈ ఫలితాల ఆధారంగా MD, MS, DNB, DrNB (డైరెక్ట్ 6 సంవత్సరాల కోర్సులు), PG డిప్లొమా వంటి అగ్ర-పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలలో సీట్లు పరిమితంగా ఉండటంతో ప్రతీ విద్యార్థి అత్యంత ప్రతిష్టాత్మక పోటీకి ఎదురవుతారు.
NEET PG 2025 కట్-ఆఫ్ (కేటగిరీ వారీగా) ఇలా ఉంది: జనరల్ / EWS కేటగిరీకి 50 పర్సంటైల్ అంటే 276 మార్కులు, జనరల్ PwBD కేటగిరీకి 45 పర్సంటైల్ అంటే 255 మార్కులు, SC / ST / OBC / PwBD కేటగిరీకి 40 పర్సంటైల్ అంటే 235 మార్కులు.
NEET PG 2025 ఫలితాలను చెక్ చేయడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్ లేదా NEET PG పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత NEET PG 2025 రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఫలితాలు స్క్రీన్‌లో కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవడం అవసరం.