అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం పర్యటించారు. రాజోలు కాటన్ పార్క్ దగ్గర వశిష్ట ఎడమ కాలువ ఏటిగట్టును పటిష్టం చేసేందుకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల పాటు నీటిపారుదల రంగం పూర్తిగా నిర్లక్ష్యం అయ్యింది, 50 వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందని దీనికి జగన్ కారణమని అన్నారు.
ఆల్మట్టి డ్యామ్ విషయంలో జగన్ ఇప్పుడు ఆందోళన చెందడం తగినది కాదని ఇప్పుడు ఆల్మట్టి గురించి చింతించడం నమ్మశక్యంగా లేదని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రతిపాదనను అడ్డుకుంటూ న్యాయ మార్గం ద్వారా రాష్ట్రానికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తూనే ఉందని వివరించారు.
పోలవరం డ్యామ్ డయాఫ్రామ్ వాల్‌కి నష్టానికి కారణం కూడా జగన్ అని చెప్పారు. ఉత్తరాంధ్రా ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడానికి, రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులు నిలిచిపోవడానికి జగన్ పాలన కారణమని తెలిపారు.
జగన్ ఫేక్ ప్రారంభాలు చేసి అభాసుపాలు అయ్యాడని చెప్పుకొచ్చారు. ఆయన అసలు స్వరూపం, లోపభరితమైన పాలన ప్రజలకు అర్థమైందని, అందుకే ప్రజలు చివరికి జాగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.
గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న జగన్ ఏమీ చేయకుండా, చౌకబారు విమర్శలు, అబద్ధాలపైన దృష్టి పెట్టడం సిగ్గు చేటు, రాష్ట్ర ప్రాజెక్టులు, రైతుల పరిస్థితుల పట్ల ఆయన జాగ్రత్త చూపకపోవడం వల్ల ఈ సమస్యలు మరింత పెరిగాయని వివరించారు.