పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజు గారి గది 4 శ్రీచక్రం సినిమా 2026 దసరా పండుగకి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను ఎక్స్ ద్వారా పంచుకున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అయితే ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మిరాయ్ చిత్రంతో చిత్రంతో విజయం అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది రాజు గారి గది సిరీస్‌లో నాలుగో భాగంగా ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా హరర్-కామెడీ జానర్‌లో కొత్తదనంతో అలరించనుంది.
దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచింది. పోస్టర్‌లో ఎరుపు చీర కట్టుకున్న ఒక మహిళ గాల్లో తేలుతూ కనిపిస్తుంది. ఆమె ముందు శక్తివంతమైన కాళీ దేవత విగ్రహం కనిపిస్తుంది. ఈ దృశ్యం సినిమా ఆధ్యాత్మిక, అతీత శక్తుల నేపథ్యాన్ని సూచిస్తున్నది.ఏ డిఫరెంట్ హరర్ బిగిన్స్ అనే ట్యాగ్‌లైన్ తో ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది.
సినిమాకు ధమన్ సంగీతం అందిస్తున్నారు. ఓంకార్ మార్క్ కథనం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. శ్రీచక్రం కథ కాలికాపురం అనే ఊరిలో జరుగుతుంది. ఇది కేవలం భూతప్రేతాల కథే కాదు. పాతకాల విశ్వాసాలు, భయాలు, అతీత శక్తుల చుట్టూ తిరుగుతున్న ఆధ్యాత్మిక హరర్-కామెడీ గా ఉండనుందని మేకర్స్ చెప్పారు.
మేకర్స్ వివరాల ప్రకారం, సినిమా దృశ్యాలు, స్పెషల్ ఎఫెక్ట్స్, భయానకమయిన, అలాగే హాస్యభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.రాజు గారి గది సిరీస్ ఫ్యాన్స్ కోసం ఈ నాలుగో భాగం మరింత ప్రత్యేకంగా ఉంటుంది అని వారు తెలిపారు..
మొత్తానికి రాజు గారి గది 4( శ్రీచక్రం) సినిమా పాతకాల భయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, హాస్యభరిత సన్నివేశాలను కలిపి దసరా 2026కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హరర్-కామెడీ జానర్‌లో మరొక ప్రత్యేక చాప్టర్‌గా ఇది నిలుస్తుందని చెప్పుకోవచ్చు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మరో ప్రతిష్టాత్మక హరర్-కామెడీ చిత్రం.. హీరో ఎవరంటే??
