రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షకు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, జూన్ 6 నుంచి జూలై 2 వరకు జరిగిన పరీక్షలకు 92.90% మంది హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను సమీక్షించిన అనంతరం, సవరించిన తుది ‘కీ’ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియతో ఫలితాలను సిద్ధం చేసినట్టు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు.
అభ్యర్థులు తమ తుది ఫలితాలు మరియు స్కోర్‌కార్డులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in ద్వారా చూసుకోవచ్చు. వ్యక్తిగత లాగిన్ ద్వారా వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి స్కోర్‌కార్డును పరిశీలించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో రాసిన పేపర్లు, సాధించిన మార్కులు, క్వాలిఫైడ్/నాన్‌క్వాలిఫైడ్ వివరాలు అందుబాటులో ఉంటాయి.
ఫలితాలను చూడటానికి – ముందుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘మెగా డీఎస్సీ-2025 రిజల్ట్స్’ పై క్లిక్ చేయాలి. తర్వాత వచ్చే లాగిన్ పేజీలో యూజర్ నేమ్, పాస్‌వర్డ్ నమోదు చేసి లాగిన్ కావాలి. అప్పుడు మీ స్కోర్‌కార్డు తెరపై కనిపిస్తుంది. దాన్ని పరిశీలించి అవసరమైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.