LIVE
Mahendragiri Varahi: సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ అవుట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డివోషనల్ మిస్టరీ!  •  Railway UPdates: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 1 నుంచి మారిన తత్కాల్ రూల్స్.. ఆధార్ ఓటీపీ ఉంటేనే టికెట్!  •  Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!  •  US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!  •  TTS: నాష్‌విల్లేలో టీటీఎస్ పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం.. క్రీడాస్ఫూర్తికి తెలుగు సమాజం మద్దతు!  •  MATA: మాటా జాతీయ మహాసభల్లో క్రీడా విజేతలకు ఘన సన్మానం!  •  TCA: టీసీఏ ‘హ్యూస్టన్ ఐడల్’కు రంగం సిద్ధం.. ప్రవాస తెలుగు ప్రతిభకు భారీ వేదిక!  •  Peddi movie: ఆ 15 సీన్లు మా మనోభావాలను దెబ్బతీశాయి.. 'పెద్ది' సినిమా డైలాగులపై ఆదివాసీ సంఘాల ఫైర్!  •  Tourism: పాపికొండల పర్యాటకంపై పులి ప్రభావం.. భయంతో తగ్గిన సందర్శకుల రద్దీ!  •  Australia Updates: ఆస్ట్రేలియాలో పసుపు జాతర.. మెల్బోర్న్ మహానాడు ఘన విజయం, 1,200 మందితో రికార్డ్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Mahendragiri Varahi: సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ అవుట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డివోషనల్ మిస్టరీ!  •  Railway UPdates: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 1 నుంచి మారిన తత్కాల్ రూల్స్.. ఆధార్ ఓటీపీ ఉంటేనే టికెట్!  •  Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!  •  US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!  •  Peddi movie: ఆ 15 సీన్లు మా మనోభావాలను దెబ్బతీశాయి.. 'పెద్ది' సినిమా డైలాగులపై ఆదివాసీ సంఘాల ఫైర్!  •  Australia Updates: ఆస్ట్రేలియాలో పసుపు జాతర.. మెల్బోర్న్ మహానాడు ఘన విజయం, 1,200 మందితో రికార్డ్!  •  Janhvi Kapoor: జాన్వీ కపూర్ తప్పు లేదు.. ‘పెద్ది’ కెమెరా యాంగిల్స్ వివాదంపై నటి మేకప్ ఆర్టిస్ట్ సంచలన పోస్ట్!  •  AP News: గోదావరి రైతాంగానికి తీపి కబురు.. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మార్పునకు ప్రభుత్వం ముహూర్తం! రూ.124 కోట్లతో..  • 
Helping Hand

Qatar: ఎన్నారై టీడీపీ ఖతార్‌ ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం! చంద్రబాబు జన్మదినం సందర్భంగా..

Qatar: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఖతార్‌లో తెలుగు ప్రవాసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి మహా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.

AndhraPravasi News Desk 2 min read
Qatar: ఎన్నారై టీడీపీ ఖతార్‌ ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం! చంద్రబాబు జన్మదినం సందర్భంగా..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకున్న ఖతార్‌లో తెలుగు ప్రజలు..

ఎంతో ఘనంగా మహా రక్తదాన శిబిరం ఏర్పాటు..

ఖతార్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఖతార్‌లో తెలుగు ప్రవాసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి మహా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా “ఒక్క రక్త బిందువు – ఎన్నో ప్రాణాలకు జీవం” అనే మహత్తర సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

ఎన్నారై టీడీపీ ఖతార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో కులం, మతం, దేశం, ధనిక–పేద అనే భేదాలకు అతీతంగా మానవత్వమే ముఖ్యమని నిరూపించారు. ఒక మనిషి మరో మనిషికి ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమానం రక్తదానం అనే భావనను ప్రతి ఒక్కరిలో నింపేలా కార్యక్రమం సాగింది.

ఈ సందర్భంగా ఎన్.ఆర్.ఐ టీడీపీ ఖతార్ అధ్యక్షులు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ… నాయకుడి జన్మదినాన్ని వేడుకగా కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా నిర్వహించడం నిజమైన గౌరవమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజాసేవ కోసం అని, సేవ చేయడానికి దేశాల మధ్య ఎలాంటి భేదం ఉండదని, ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలకు అండగా నిలబడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

శనివారం వర్కింగ్ డే అయినప్పటికీ ఖతార్‌లోని తెలుగు కుటుంబాల నుండి విశేష స్పందన లభించింది. సుమారు 65 మంది సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా టీడీపీ ఖతార్ మహిళలు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి రక్తదానంలో పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి సేవా భావం సమాజానికి స్ఫూర్తినిచ్చే ఉదాహరణగా నిలిచింది.

ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు రవి వేమూరి, గల్ఫ్ విభాగం అధ్యక్షులు రావి రాధాకృష్ణ, ఏపీ ఎన్నార్టీ సర్వీసెస్ డైరెక్టర్ అక్కిలి నాగేంద్రబాబు, ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ తదితరులు తమ సహకారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా తెలుగు డయాస్పోరా సభ్యులు మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి, సేవా భావం, సమాజం పట్ల బాధ్యతను నిలబెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు.

ఈ మహా రక్తదాన శిబిరం విజయవంతం కావడానికి శాంతయ్య యలమంచిలి, రవీంద్ర మాగులూరి, కవీంద్ర గాలి, కల్యాణ చక్రవర్తి నార్నే, రమేష్ దాసరి, అంజనేయులు మోడి, అంజనేయులు మాదినేని, అనిల్ మలసాని, లక్ష్మి గొట్టిపాటి, రజని బొందలపాటి, ఎం.ఎం.ఎస్ నాయుడు, రియాజ్ షేక్ తదితరులు ముఖ్య నిర్వాహకులుగా కృషి చేశారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన వాలంటీర్లు, రక్తదాతలు, భాగస్వామ్య సంస్థలకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రవాసులు మానవత్వానికి సేవ చేస్తూ, తెలుగు సమాజానికి అండగా నిలుస్తూ, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ ముందుకు సాగుతున్నారని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించింది.

Be the first to react

More Coverage

Oman: ఒమాన్‌లో ఇరుక్కున్న మహిళను రక్షించిన కూటమి కార్యకర్తలు! సురక్షితంగా స్వదేశానికి చేరిన బాధితురాలు!

Oman: ఒమాన్‌లో ఇరుక్కున్న మహిళను రక్షించిన కూటమి కార్యకర్తలు! సురక్షితంగా స్వదేశానికి చేరిన బాధితురాలు!

Oman: ఉద్యోగం కోసం ఒమాన్‌కు వెళ్లిన ఒక మహిళకు ఎదురైన భయానక అనుభవం చివరికి సుఖాంతం అయింది. ఆంధ్రప్రదే…