ఇది కూడా చదవండి: NRI లు పంపే డబ్బు ఈ సం// రికార్డు బ్రేక్! ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం గా ఇండియా! ఆ దేశం నుండే ఎక్కువ!
అమెరికాలో జలపాతంలో గల్లంతైన ఆంధ్ర యువకుడు
తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలంలోని చింతలపూడి గ్రామానికి చెందిన యువ ఇంజినీర్ సెనగన హరి కిరణ్ గౌడ్ (25) అమెరికాలో జరిగిన విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. వంశపారంపర్యంగా వ్యవసాయ కుటుంబానికి చెందిన హరి కిరణ్, హైదరాబాదులో ఇంజినీరింగ్ పూర్తిచేసిన అనంతరం పైచదువుల కోసం ఆరు నెలల క్రితం స్టూడెంట్ లోన్ ద్వారా అమెరికాకు వెళ్ళాడు.
ఇది కూడా చదవండి: Dwakra: ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుతమైన అవకాశం..! ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు, వివరాలివే..!
అమెరికాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్న హరి కిరణ్, ఇటీవల 12 మంది స్నేహితులతో కలిసి మిస్సిసిప్పీ నది వద్ద లాంగ్ వీకెండ్ కాగా విహారయాత్రకు వెళ్లాడు. అయితే ఈ విహారయాత్ర విషాదంగా మారింది. అక్కడ జరిగిన ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. వారిలో ఒకరు అమెరికా పౌరుడు కాగా, మరొకరు హరి కిరణ్ గౌడ్. పోలీసుల గాలింపు చర్యల అనంతరం ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు.
Raghurama Speech: నాకు ఒక్క రోజు హోంమినిస్టర్ పదవి ఇస్తే రెడ్ బుక్ కాదు.. అంతా బ్లడ్ బుక్కే!
ఈ వార్త గ్రామానికి చేరడంతో చింతలపూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికులు, గ్రామ ప్రజలు కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.
మృతదేహాన్ని భారత్‌కు తరలించే ప్రక్రియను తానా (TANA) టీమ్ స్క్వేర్ చేపట్టింది. ఎన్నారై టిడిపి సెల్ మరియు ఏపీ ఎన్నార్టీ వారికి తగిన సహకారం అందిస్తున్నది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్నారై మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీ ప్రెసిడెంట్ డా. రవి వేమూరి, ఎన్నారై టిడిపి సెల్ కోఆర్డినేటర్ రాజశేఖర్ ఎప్పటికప్పుడు తానా టీమ్స్ స్క్వేర్ అధ్యక్షులు కిరణ్ కొత్తపల్లి మరియు వారి టీం తో మాట్లాడుతూ వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారు.
Road Construction: ఆ 9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!
మృతదేహాన్ని తరలించేందుకు అయ్యే ఖర్చు అధికంగా ఉండటంతో, గో ఫండ్ (Go Fund) ద్వారా నిధుల సేకరణ కూడా చేపట్టారు. అందులో భాగంగా స్నేహితులు, అమెరికాలోని తెలుగు సంఘాలు, సామాజిక కార్యకర్తలు నిధుల సేకరణకు పిలుపునిస్తున్నారు.
హరి కిరణ్ మృతదేహం ఈ బుధవారం లేదా గురువారం భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది. బాధిత కుటుంబానికి చిన్న సహాయమే అయినా, ప్రతి రూపాయి ఎంతో విలువైనదిగా ఉంటుంది. అందుచేత, మీరు కూడా పెద్దమనసు చేసుకొని ఈ క్రింది గో ఫండ్(Go Fund) లింక్ ద్వారా మీ వంతు సహాయం చేయాలని హరి కిరణ్ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సహాయం చేయదలచిన వారు ఈ లింకు ను క్లిక్ చేయండి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Toll Fee: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఈ మార్గాల్లో టోల్ ఫీజు తగ్గింపు!
Vijayawada Railway: మీకు ఇది తెల్సా.! రైల్వే ఛార్జీలు బాగా పెరిగాయ్.. కానీ లోకల్ ట్రైన్స్‌లో..
Inherited lands: వారసత్వ భూములకు తక్కువ ఖర్చుతో సెక్షన్ సర్టిఫికెట్లు.. చంద్రబాబు శుభవార్త !
America 249: వైట్ హౌస్ పైగా దూసుకెళ్లిన స్టెల్త్ బాంబర్లు... ట్రంప్ దంపతుల సెల్యూట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: