ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త.. భారత ఆర్మీ నియామక ప్రక్రియ 2025 కోసం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.
ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అర్హతలు, వయసు పరిమితి, విద్యార్హతలు, ఎంపిక విధానం, ఇతర ముఖ్యమైన సూచనలు వంటి వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి.
భారత సైన్యం 66వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఏప్రిల్ 2026 కోసం ప్రారంభించింది. దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు (పురుషులు, మహిళలు) joinindianarmy.nic.in వెబ్‌సైట్ కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆగస్టు 14, 2025 దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ. 379 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నియామక కార్యక్రమం చేపట్టబడుతోంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.