LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nellore News: జువ్వలదిన్నెలో షిప్ బిల్డింగ్ సెంటర్ ప్రారంభించిన నారా లోకేష్.!

Juvvaladinne Fishing Harbor: నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద దేశంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైం షిప్ యార్డ్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. సాగర్ డిఫెన్స్ సంస్థ ద్వారా రూ. 45 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్…

AndhraPravasi News Desk 2 min read
Nellore News: జువ్వలదిన్నెలో షిప్ బిల్డింగ్ సెంటర్ ప్రారంభించిన నారా లోకేష్.!

Juvvaladinne Fishing Harbor: నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు దేశం మొత్తాన్ని తనవైపు   ఆకర్షించేందుకు  సిద్ధం అవుతుంది. ఇక్కడ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ మెగా ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను తిలకించారు. సముద్ర గర్భంలో పనిచేసే రోబోటిక్స్, అత్యాధునిక షిప్ బిల్డింగ్ సాంకేతికతపై ప్రతినిధులతో చర్చించారు.

ఈ ప్రాజెక్టు కేవలం పరిశ్రమ స్థాపన మాత్రమే కాదు, స్థానిక యువతకు ఒక వరం అని చెప్పాలి. మొదటి దశలో సాగర్ డిఫెన్స్ సంస్థ రూ. 45 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీని ద్వారా దాదాపు వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కేవలం సాధారణ పనులే కాకుండా మెరైన్ ఇంజనీరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) వంటి ఉన్నత స్థాయి రంగాల్లో యువతకు ఉపాధి దొరకడం గమనార్హం. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును 200 ఎకరాల విస్తీర్ణానికి పెంచే ప్రణాళికలు ఉన్నాయి.

పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు కోసం వేగంగా అడుగులు వేసింది. జువ్వలదిన్నె హార్బర్ సమీపంలో మొదటి దశ కింద 29.58 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించింది. ఇందులో నీటి అంచున ఉండే 7.58 ఎకరాల ప్రత్యేక భూమి  కూడా ఉంది. 2026 నవంబర్ నాటికి ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు, అంటే నౌకల తయారీ  ప్రయోగాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి.

ఈ షిప్ యార్డ్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 'బ్లూ ఎకానమీ' లో కీలక పాత్ర పోషించనుంది. దేశంలోనే తొలిసారిగా స్వయంచాలక నౌకల తయారీ కేంద్రం ఇక్కడ రావడం వల్ల ఏపీ మారిటైం రోబోటిక్స్ హబ్ గా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. సముద్ర భద్రతలో వాడే అత్యాధునిక సిస్టమ్స్ ఇక్కడే తయారవ్వడం రాష్ట్రానికే గర్వకారణం. మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తున్నామని, యువతకు స్థానికంగానే ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా నెల్లూరు జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు మరియు టీడిపి శ్రేణులు ఆయనకు కప్పరాలతిప్ప వద్ద ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సాగర్ డిఫెన్స్ సీఈవో కెప్టెన్ నికుంజ్ పరాశర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు నెల్లూరు జిల్లా ముఖచిత్రాన్ని మార్చేస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…