రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల కష్టఫలితం వృథా కాకుండా చూడటం మా బాధ్యత. ఏవైనా ఇబ్బందులు తలెత్తినచో ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుంది అని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని రాప్తాడు మార్కెట్‌లో ఆదివారం టమోటా ధరలు ఇలా నమోదయ్యాయి. గరిష్ట ధర కిలో రూ.18, కనిష్ఠం రూ.9, మోడల్ ధర రూ.12. రైతులు తమ పంటకు తగిన ధర పొందేలా ప్రభుత్వం పర్యవేక్షణ కొనసాగిస్తోంది అని వివరించారు.
పత్తికొండ మార్కెట్‌కు సాధారణంగా 30 నుంచి 40 మెట్రిక్ టన్నుల వరకు సరుకు వస్తుంది. కానీ దసరా సెలవులు ఉండటంతో అదనంగా మరో 10 టన్నులు చేరాయి. కొంతమంది రైతులు రోడ్లపై 2వ గ్రేడ్ క్వాలిటీ టమోటాలు వేసి గందరగోళ పరిస్థితి సృష్టించారు అని తెలిపారు.
ఇప్పటివరకు 10 మెట్రిక్ టన్నుల టమోటాలను వివిధ రైతు బజార్లకు పంపించామన్నారు. ఈ రోజు కూడా పత్తికొండ మార్కెట్‌లో సేకరించిన 10 టన్నులను చిత్తూరు ప్రాసెసింగ్ యూనిట్‌కి, మరో 15 టన్నులను రైతు బజార్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు.
తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు సరుకు ఎగుమతి సాధారణంగా ఎక్కువగా జరుగుతుంది. కానీ వర్షాల కారణంగా సరుకు తగ్గింది. వర్షప్రభావం వల్ల అమ్మకాలు మందగించాయి రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు అని చెప్పుకొచ్చారు.
ఆదివారం రాప్తాడు మార్కెట్‌కు 3000 మెట్రిక్ టన్నులు చేరాయి. అందులో కిలో గరిష్ట ధర రూ.18, కనిష్ఠం రూ.9గా ఉంది. టమోటాకు సరైన ధర లభించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రైతుల సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం రైతు సమృద్ధిః దేశ సమృద్ధిః అని మంత్రి చెప్పారు.