టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున మనుషుల జీవనశైలి కూడా మారింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో చేతిలో స్మార్ట్‌ఫోన్ లేని వ్యక్తిని కనుగొనడం అసాధ్యం. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఫోన్ కేవలం కాల్స్ కోసం మాత్రమే కాదు, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, న్యూస్, వీడియో కాల్స్ వంటి అనేక అవసరాలకు వినియోగిస్తున్నారు. అయితే, ఈ సౌకర్యాలను పొందడానికి డేటా అవసరం అవుతుంది, అందుకే ప్రతి నెల వందల రూపాయలు ఖర్చవుతున్నారు.
ఇప్పటి వరకు జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు కనీసం రోజుకు 2GB డేటాతో ప్లాన్లను అందిస్తూ, నెలకు కనీసం ₹200కు పైగా వసూలు చేస్తున్నారు. మూడు నెలల (84 రోజుల) రీచార్జ్ తీసుకోవాలంటే ₹800కు పైగా ఖర్చు అవుతుంది. కానీ, ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం BSNL బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్లను అందిస్తోంది. కొత్త రూ.599 రీచార్జ్ ప్లాన్‌లో 84 రోజుల పాటు ఏకంగా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 3GB హైస్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఇది జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లతో పోలిస్తే దాదాపు సగం ధరలో అందుబాటులో ఉంది.
BSNL మరో ప్రత్యేక ఆఫర్ కూడా అందిస్తోంది. కొత్త సిమ్ కొనుగోలు చేసే వినియోగదారులు కేవలం ₹1తో 30 రోజులపాటు అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలు పొందవచ్చు. ఈ ఆఫర్ ఆగస్ట్ 1 నుంచి 30 వరకు కొత్త వినియోగదారులకే వర్తిస్తుంది. BSNL చౌక ధరలో అధిక విలువ ఇచ్చే ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షిస్తూ, మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తోంది.