బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 2025 సంవత్సరానికి 1121 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రకటించింది. వీటిలో 910 రేడియో ఆపరేటర్లు (RO), 211 రేడియో మెకానిక్స్ (RM) పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 24, 2025 నుండి సెప్టెంబర్ 23, 2025 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు BSF అధికారిక వెబ్‌సైట్ [bsf.gov.in](http://bsf.gov.in) లో లభిస్తాయి.
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) పోస్టులకు 12వ తరగతి (MPC) ఉత్తీర్ణత తప్పనిసరి. లేదా, ITI లో రేడియో/ఎలక్ట్రానిక్స్ కోర్సు పూర్తి చేసి 12వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు కూడా అర్హులు. అదే విధంగా, హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) పోస్టులకు ITI సర్టిఫికేట్‌తో పాటు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత లేదా 12వ తరగతిలో PCM సబ్జెక్టులు ఉండాలి.ఈ నియామకం ద్వారా సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతకు సరిహద్దు రక్షణ దళంలో పనిచేసే అద్భుతమైన అవకాశం లభిస్తోంది.