Politics: మాజీ మంత్రి జగన్ కు ఝలక్... పార్టీకి గుడ్ బై!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  మామిడి రైతులకు  అండగా నిలిచింది.. ఈ మేరకు వారికి సబ్సిడీని  అందజేస్తోంది . తాజాగా  మరోసారి చిత్తూరు జిల్లా లో తోతాపురి మామిడి రైతులకి  ప్రభుత్వం  సబ్సిడీ  ఇవ్వనుంది . ఇప్పటివరకు  సేకరించిన  మామిడికి  కిలోకు  రూ.4 చొప్పున సబ్సిడీ  ఇస్తారు . ఈ సబ్సిడీ మొత్తం  రూ.150 కోట్లు  త్వరలోనే  రైతుల ఖాతాల్లో  ఈ డబ్బు  జమ చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్  సుమిత్ కుమార్  తెలిపారు .

New Mandal: ఏపీలో కొత్తగా మరో మండలం ఏర్పాటు.. ఆ జిల్లాలోనే! ఆ మండలాన్ని విభజించి రెండుగా!


కలెక్టరేట్  లో మామిడి పంట వివరాలపై  ఆయన సమీక్ష  నిర్వహించారు . ఈ సమీక్షలో  జేసీ  విద్యాధరి , ట్రైనీ కలెక్టర్  నరేంద్ర పాడెల్ , వ్యవసాయశాఖ  జేడీ  మురళీకృష్ణ, ఉద్యానశాఖ డీడీ  మధుసూదన్ , మార్కెటింగ్ శాఖ  ఏడీ  పరమేశ్వరన్ ,ట్టుశాఖ జేడీ  పద్మావతి , మండల స్థాయి అధికారులు  పాల్గొన్నారు .

New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్ 1086 ఎకరాల్లో.. డీపీఆర్‌కు రెడీ! ఆ జిల్లాకు మహర్దశ.. భూముల ధరలకు రెక్కలు!


మామిడి రైతులకి సబ్సిడీ  సక్రమంగా  అందేలా  చూడాలని కలెక్టర్  అధికారులకు  సూచించారు . జూన్ నెలలో  సేకరించిన  మామిడికి జులైలో  సబ్సిడీ  ఇస్తారు . జులైలో సేకరించిన  మామిడికి  ఆగస్టులో  సబ్సిడీ ఇస్తారు . ఏపీ ప్రభుత్వం  2.25 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని సేకరించింది . ఈ మేరకు  22,435 మంది రైతుల  వివరాలను మండల స్థాయి బృందాలకు  అందిస్తారు .

Heavy Rains: వాతావరణ శాఖ హెచ్చరిక! ఏపీలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు!


ఈ మేరకు గ్రామ స్థాయి అధికారులు  తో మండల వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు  కలిసి  రైతుల వివరాలను  పరిశీలిస్తారు. రైతుల బ్యాంకు ఖాతాలు , IFSC కోడ్ , ఈ-క్రాప్ వివరాలను  సరి చూస్తారు .

Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..! బిగ్ అప్‌డేట్ ఇదిగో..!


చిత్తూరు జిల్లా నుంచి  ఇతర రాష్ట్రాలకు  తరలించిన  మామిడి రైతులకు కూడా ప్రభుత్వం  మద్దతు ధర  ఇస్తుంది .. ఈ మేరకు వారి జాబితాను  సిద్ధం చేయాలని కలెక్టర్  అధికారుల్ని ఆదేశించారు . కలెక్టర్ సుమిత్ కుమార్  చిత్తూరు జిల్లాలోని  బంగారుపాళ్యం , రొంపిచెర్ల , పలమనేరు , పులిచెర్ల , యాదమరి , సదుం మండలాల  అధికారులతో  మాట్లాడారు .

Movie Event: 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్! నేను కూడా ఈ మూవీ కోసం వెయిటింగ్.. మంత్రి కామెంట్స్!


మామిడి కాయలకు సంబంధించి సబ్సిడీ సొమ్ము  దుర్వినియోగం కాకుండా చూడాలని  ఆ బాధ్యత మండల అధికారులపై  ఉంది. మొత్తం మీద  రైతులకు  మరో రూ.150 కోట్లు  డబ్బులు  బ్యాంక్ అకౌంట్‌లలో  జమ చేయనున్నారు  అధికారులు .

Delta Airlines: ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం.. సమీపంలోకి యుద్ధ విమానం.. ప్యాసింజర్ ఫ్లైట్!
Green card : గ్రీన్‌కార్డుకు రెడ్‌ సిగ్నల్‌.. కార్పొరేట్‌ రంగంపై పెనుప్రభావం! మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు..
Indian Army Recruitment: ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగులకు శుభవార్త… ఆర్మీలో కొత్త ఉద్యోగాలు..