పాస్‌పోర్ట్‌ అనేది కేవలం విదేశీ ప్రయాణానికి అవసరమైన పత్రం మాత్రమే కాదు. అంతర్జాతీయ స్థాయిలో మన వ్యక్తిత్వాన్ని, పౌరసత్వాన్ని తెలియజేసే ముఖ్యమైన గుర్తింపు పత్రం కూడా. ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లాలంటే ఇది తప్పనిసరిగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తమ పౌరులకు ప్రత్యేక పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తాయి.

భారతదేశం కూడా తన పౌరులకు ప్రత్యేక పాస్‌పోర్ట్‌లను అందిస్తుంది. కానీ ఒక్క రకమైన పాస్‌పోర్ట్ మాత్రమే కాదు, నాలుగు విభిన్న రంగుల్లో పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తుంది. వీటిలో నీలం, తెలుపు, ఎరుపు, నారింజ రంగుల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఒక్కో రంగు ఒక్కో ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది. ఆ రంగు చూసే సరికి ఆ వ్యక్తి స్థాయి ఏమిటి, వారి ప్రయాణ ఉద్దేశ్యం ఏమిటి అనే విషయం ఇమిగ్రేషన్ అధికారులకు అర్థమవుతుంది.

ఉదాహరణకు సాధారణ పౌరులకు ఇచ్చే పాస్‌పోర్ట్ నీలం రంగులో ఉంటుంది. ప్రభుత్వ అధికారులకు, రాయబారులకు వేర్వేరు రంగుల పాస్‌పోర్ట్‌లు జారీ అవుతాయి. ప్రత్యేక వర్గాల కోసం కూడా వేరే రంగు పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తారు. ఈ విధంగా రంగు ఆధారంగా పాస్‌పోర్ట్ వర్గీకరణ ఉండటంతో, అంతర్జాతీయ ప్రయాణాల్లో ఎలాంటి చిక్కులు లేకుండా సులభంగా సరిహద్దులు దాటే అవకాశం ఉంటుంది.