Header Banner

బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.! వ్యాపారులు అందరూ అప్రమత్తంగా...

  Mon Apr 21, 2025 14:15        Business

ప్రస్తుత కాలంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం బాగా పెరిగినప్పటికీ, సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్లోకి ఇటీవల నకిలీ చెల్లింపు యాప్స్ వచ్చాయి. వీటిని చూస్తే నిజంగా GPay, PhonePe, Paytmల మాదిరిగానే కనిపిస్తాయి. కానీ నిజానికి ఇవి ఫేక్ చెల్లింపు యాప్‌లు. ఇవి డబ్బు పంపిన తర్వాత నోటిఫికేషన్‌ పంపించినట్లు చూపిస్తాయి. కానీ చెల్లింపు మాత్రం జరగదు. ఇలాంటి వాటి విషయంలో విక్రేతలు లేదా వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నకిలీ యాప్‌లను ఉపయోగించి అనేక మంది మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ప్రత్యేకించి చిన్న వ్యాపారులు ఈ మోసాల వల్ల ఎక్కువగా నష్టపోతారని చెప్పారు. ఈ క్రమంలో వినియోగదారులు, వ్యాపారులు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నకిలీ యాప్‌ల వలలో పడకుండా, అసలైన యాప్‌లను మాత్రమే గుర్తించడంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో మోసాలను గుర్తించి, అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యమని నిపుణులు సూచించారు. మార్కెట్లో యాక్టివ్‌గా ఉన్న ఈ నకిలీ చెల్లింపుల్లో కొన్ని చాలా అధునాతనమైనవి కావడంతో వాటిని గుర్తించడానికి చిన్న చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

 

ఇది కూడా చదవండి: ప్రజలకు బిగ్ అలర్ట్.. నకిలీ 500 నోట్లు వస్తున్నాయ్.. అసలైందేనా? నకిలీదా? ఎలా తెలుసుకోవడం?

 

 

ఈ యాప్ చెల్లింపు నోటిఫికేషన్‌ బీప్ సౌండ్ నిజం మాదిరిగా అనిపించడంతో అనేక మంది కూడా గుర్తించలేకపోతున్నారు. దీని కారణంగా చెల్లింపు పూర్తయినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ చెల్లింపు జరగదు. డబ్బు కూడా ఖాతాలోకి రాదు. మోసపూరిత లావాదేవీల విషయంలో స్కామర్లు నకిలీ చెల్లింపు యాప్‌లను ఉపయోగిస్తారు. ఆ క్రమంలో వ్యాపారులు కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ చెల్లింపు యాప్ లేదా బ్యాంక్ లావాదేవీలను ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి. స్క్రీన్‌షాట్‌లు లేదా నోటిఫికేషన్‌లపై మాత్రమే ఆధారపడవద్దు. లావాదేవీ వివరాలలో వ్యత్యాసాలు ఉన్నాయో లేదా పరిశీలించాలి. లావాదేవీని త్వరగా పూర్తి చేయమని మిమ్మల్ని ఒత్తిడి చేసే, మీకు సమయం ఇవ్వని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రాంతంలో సాధారణంగా ఉపయోగించే చట్టబద్ధమైన చెల్లింపు యాప్‌ల గురించి తెలుసుకోండి. ఎవరైనా తెలియని యాప్ ద్వారా చెల్లింపు చేయమని అడిగితే జాగ్రత్తగా వహించాలి. రద్దీగా ఉండే దుకాణంలో గందరగోళాన్ని లేదా వ్యాపారి దృష్టి మరల్చడాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్ళు ఈ నకిలీ చెల్లింపు యాప్‌లను ఉపయోగించి మోసం చేసే అవకాశం ఉంది. ఈ మోసపూరిత లావాదేవీల గురించి అందరికీ అవగాహన కల్పించండి.

 

ఇది కూడా చదవండి: రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (21/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!

 

సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!

 

నేడు భారత్ లో అడుగు పెట్టనున్న ఆంధ్రా అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు.. మోడీతో భేటీ - ఏపీలో ఆ జిల్లాకి రావాలి అంటూ ప్రజలు కోరుతున్నారు..

 

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛత, తాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #UPIPayment #Moneytransfer #MoneyTransferProblem #Payment #OnlinePayment #OnlinePaymentProblem