Project repairs: కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం స్పెషల్ ప్రణాళిక..! త్వరలో టెండర్ ప్రక్రియ వేగవంతం..!

వంటగ్యాస్ వినియోగదారులకు స్వల్పంగా అదనపు భారం కాస్త వచ్చిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.15.50  పెంపు అమలు అమలు చేశారని  కొత్త ధరలు ఈరోజు తెల్లవారు జామునుంచే అమల్లోకి వచ్చాయని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఒక ప్రకటనలో తెలపడం జరుగుతుంది.

Chandrababu Naidu: దసరా పండుగ వారికి భారీ గుడ్ న్యూస్! రూ.400 కోట్ల నిధులు విడుదల! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!

ఇక ముందు పరిస్థితి చూస్తే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొన్నిసార్లు ధరలను తగ్గించాయి కూడా  ఇటీవలే కమర్షియల్ సిలిండర్ ధరలను రూ.51.50 తగ్గించాయి. అలాగే కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమైనప్పుడు కూడా వాణిజ్య సిలిండర్ ధరలను రూ.41 తగ్గించి వినియోగదారులకు కొంత ఉపశమనం కల్పించారు. అయితే ఇప్పుడు మళ్లీ పెంపు మొదలైంది. దీంతో వ్యాపార అవసరాల కోసం గ్యాస్ వాడేవారికి కొంత భారమైంది.

AP Vahanamitra: ఏపీలో వాహన మిత్ర లిస్ట్ వచ్చేసింది! మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

అయితే గృహ వినియోగదారులకు మాత్రం ఎలాంటి మార్పులు లేవు. సాధారణంగా ఇంట్లో వాడే 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అంటే ఇంటి వంటగది సిలిండర్ ధరలో ఎలాంటి పెరుగుదల లేదా తగ్గుదల జరగలేదు.

High-Speed corridor: గుడ్ న్యూస్... కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీకి మరో కొత్త హై స్పీడ్ కారిడార్! ఈ రోట్లోనే...

ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రకటించిన ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి:

పనిముట్లను దైవంగా పూజించే విశిష్ట పండుగ! అయుధ పూజ విశేషాలు!

* ఢిల్లీ లో రూ.853

* గుర్గావ్ లో రూ.861.50

* అహ్మదాబాద్ లో రూ. 860

* జైపూర్ లో రూ. 856.50

* పాట్నా లో రూ. 942.50

* ఆగ్రా లో రూ. 865.50

* మీరట్ లో రూ. 860

* ఘజియాబాద్ లో రూ. 850.50

* ఇండోర్ లో రూ. 881

* భోపాల్ లో రూ. 858.50

* లూధియానా లో రూ. 880

* వారణాసి లో రూ. 916.50

* లక్నో లో రూ. 890.50

* ముంబై లో రూ. 852.50

* పూణే లో రూ. 856

* హైదరాబాద్ లో రూ. 905

* బెంగళూరు లో రూ. 855.50

*   ఆంధ్రప్రదేశ్రరు 925 

ఈ ధరలు ప్రస్తుతం గృహ వినియోగం కోసం యథాతథంగా అమల్లో ఉన్నాయి. కాబట్టి ఇంటి అవసరాల కోసం గ్యాస్ వాడేవారికి ఎలాంటి మార్పు ఉండకపోయినా, రెస్టారెంట్‌లు హోటళ్లు బేకరీలు వ్యాపార అవసరాల కోసం సిలిండర్ వాడే వారికి మాత్రం అదనపు ఖర్చు భారం పెరిగిందని చెప్పుకోవాలి.

అందువల్ల వినియోగదారులు గమనించాల్సిన విషయం ఏమిటంటే  గృహ వాడుక ఎల్పీజీ ధర యధాతథంగానే ఉన్నా, వాణిజ్య సిలిండర్ ధర పెరిగిన కారణంగా ఆహార పదార్థాల ధరలపై కూడా పరోక్షంగా ప్రభావం పడే అవకాశం బహుశా ఉండొచ్చేమో.