బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల ఆర్సీబీ జట్టు విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట విషాదకరంగా మారింది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, హృదయ విదారకమని వారు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా వారు తమ సంతాపాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఇది చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఇది కూడా చదవండి: చిన్నస్వామి స్టేడియంలో భారీ తొక్కిసలాట.. స్పందించిన ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్!
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని చంద్రబాబు తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఈ విషాద ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వేడుకల్లో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. ముఖ్యంగా మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం తనను మరింతగా కలచివేసిందని పేర్కొన్నారు. "ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన విషాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం మరింత బాధాకరం. వేడుకల్లో ఇంత విషాదం జరగడం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని పవన్ కల్యాణ్ 'ఎక్స్'లో తన ఆవేదనను పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?
ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!
ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!
ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!
వర్చువల్ సిస్టమ్ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: