ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంబరాల్లో పలువురు మృతి చెందగా, యాభై మందికి పైగా గాయపడ్డారు. జట్టు విజయోత్సవాల్లో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. తొక్కిసలాటలో ఎంతమంది మరణించారనే దానిపై ఇప్పుడే స్పష్టమైన సమాచారం ఇవ్వలేమని ఆయన తెలిపారు. "మృతుల వివరాలను ధృవీకరించాల్సి ఉంది. భద్రత కోసం 5,000 మందికి పైగా సిబ్బందిని ఏర్పాటు చేశాం. అయితే, అక్కడ ఉన్నది ఉత్సాహంతో ఉన్న యువత. వారిపై లాఠీఛార్జ్ చేయలేము కదా" అని డీకే శివకుమార్ అన్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ తొక్కిసలాటలో పది మంది వరకు మృతి చెందగా, యాభై మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?
ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!
ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!
ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!
వర్చువల్ సిస్టమ్ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: