Tirumala Temple: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజున తిరుమల ఆలయం దాదాపు 12 గంటలు మూసివేత!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రెస్‌మీట్‌ నిర్వహించిన బీఆర్ నాయుడు, తిరుమలపై జరుగుతున్న విష ప్రచారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా, 'ముంతాజ్ హోటల్‌'కు టీటీడీ భూమిని కేటాయించిందన్న ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Bahrain Incident : బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి.. 19 మందికి రెండేళ్ల జైలుశిక్ష! ఇండియన్ ఎంబసీ ద్వారా..

ఈ భూమి కేటాయింపులు తమ ప్రభుత్వ హయాంలో జరగలేదని, గతంలో జరిగిన పీపీపీ ఒప్పందంలో భాగంగానే ఈ వివాదం మొదలైందని ఆయన స్పష్టం చేశారు. ఈ పవిత్ర స్థలాన్ని కాపాడేందుకే తమ పాలకమండలి ఆ భూమిని తిరిగి తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, తిరుమల భక్తుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Nagarjunasagar : కృష్ణమ్మ శాంతించింది.. కానీ రైతుల కళ్లలో మిగిలిన నీరు కన్నీళ్లే!

నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం, 2008లో 'దేవలోకం ప్రాజెక్టు' కోసం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) కింద 30.32 ఎకరాల భూమి కేటాయించేందుకు ఒప్పందం (ఎంఓయూ) జరిగింది. అయితే, తర్వాత గత ప్రభుత్వం హయాంలో, ఈ ప్రాజెక్టులో భాగమైన 20 ఎకరాలను 'ముంతాజ్ హోటల్‌'కు కేటాయించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు, హిందూ సంఘాలు, భక్తుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ భూమి ఏడు కొండల్లోని ఒక పవిత్ర భాగమని, అలాంటి స్థలాన్ని ఒక ప్రైవేట్ హోటల్‌కు ఎలా కేటాయిస్తారని అభ్యంతరాలు లేవనెత్తారు.

USA Visa: H-1B వీసాదారుల్లో పెరిగిన ఒత్తిడి! గ్రీన్ కార్డ్ కోసం కొత్త మార్గాలు! అమెరికాలో భారతీయుల కష్టాలు..

ముంతాజ్ హోటల్ భూమి వివాదంపై ప్రస్తుత ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి తీసుకున్న చర్యలను బీఆర్ నాయుడు వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఆ పవిత్ర స్థలాన్ని టీటీడీ తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.

Dwakra: ఏపీలో డ్వాక్రా మహిళలకు సువర్ణావకాశం..! రూ.1 లక్ష నుంచి రూ.3.5 లక్షల వరకు..!

'ఆ భూమి ముంతాజ్ హోటల్‌కు ఇవ్వడానికి వీల్లేదు, అది పవిత్రమైన స్థలం' అని పాలకమండలి గట్టిగా నిర్ణయం తీసుకుందని నాయుడు వెల్లడించారు. ఈ నిర్ణయంలో భాగంగా, హోటల్ యాజమాన్యంతో సీఎం చంద్రబాబు స్వయంగా చర్చించారని, ఆ భూమికి బదులుగా మరోచోట భూమి తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. 

Indian Navy: భారత నేవీలో చరిత్రాత్మక రోజు..! ఒకేసారి రెండు యుద్ధనౌకల ఆవిష్కరణ!

ఇంకా పేపర్ వర్క్ ప్రక్రియ జరుగుతోందని, భూమి ఇంకా టీటీడీకి హ్యాండోవర్ చేయబడలేదని నాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ భూమిని పూర్తిగా టీటీడీ ఆధీనంలోకి తీసుకుంటుందని తెలిపారు. 'ఆ పవిత్ర స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా పోనివ్వం' అని ఆయన గట్టిగా చెప్పారు.

USA Program: హ్యూస్టన్ లో దిగ్విజయవంతంగా జరిగిన “14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”.. రెండు రోజులపాటు, 28 విభిన్న వేదికలలో.!

పత్రికా సమావేశంలో బీఆర్ నాయుడు కేవలం భూమి వివాదంపై వివరణ ఇవ్వడమే కాకుండా, తిరుమలపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ముంతాజ్ హోటల్‌కు గతంలో భూమిని కేటాయించింది వారేనని, ఇప్పుడు అదే విషయాన్ని తమపై బురద చల్లేందుకు ఉపయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Magic drains: గ్రామాల్లో కొత్త ప్రయోగం.. మేజిక్ డ్రైన్లతో శుభ్రమైన వాతావరణం!

సీబీఐ విచారణ కోరే అర్హత వైఎస్సార్సీపీ నాయకులకు లేదని, "13 ఏళ్లుగా సీబీఐ నుంచి తప్పించుకు తిరుగుతున్న దొంగలు మీరు" అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమలపై విష ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారని, ముందుగా ముంతాజ్ హోటల్‌కు ఆ భూమిని ఎందుకు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 'తప్పు చేశామని లెంపలేసుకుని ముక్కు నేలకు రాయండి' అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

AP liquor Case: జగన్ కి మరో షాక్.. ఎంపీల నుంచి ఐపీఎస్‌ల వరకు.. ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామాలు!

అలాగే, అజయ్‌కుమార్ అనే వ్యక్తిని బెదిరించి భూమిని వెనక్కి తీసుకున్నారని, ఏపీలో ఉంటే చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. ఈ విషయాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, టీటీడీపై బురద చల్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా, భూమన కరుణాకర్ రెడ్డిని ఉద్దేశిస్తూ, 'ఆయన తిరుపతిలో ఉండేందుకు అర్హుడు కాదు, భూమనను తిరుపతి నుంచి తరిమికొట్టాలి' అంటూ తీవ్ర వ్యాగ్యాలు చేశారు. టీటీడీ పాలకమండలి నీతి, నిజాయితీతో పనిచేస్తోందని, తిరుమల పవిత్రతను కాపాడడమే తమ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో తిరుమల భూముల వివాదాన్ని మరింత రాజకీయ రంగు పూసే అవకాశం ఉందని చెప్పవచ్చు.

Trains: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక..! పలు రైళ్లకు షెడ్యూల్‌ చేంజ్!
Minister Meeting: అల్పపీడనంతో ప్రభుత్వం అలర్ట్.. భారీ వర్షాలపై అన్ని శాఖలకు దిశానిర్దేశం.. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం!
Apple: భారత్‌లో యాపిల్ వేగం! ఐదు ఫ్యాక్టరీలతో భారీ ప్రణాళికలు..!
Without platform : ప్లాట్ ఫామ్ లేకుంటే సమస్య తీరదు.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ !