Indian Navy: భారత నేవీలో చరిత్రాత్మక రోజు..! ఒకేసారి రెండు యుద్ధనౌకల ఆవిష్కరణ!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం పెద్ద ఊరటను కల్పిస్తోంది. ‘ఒక కుటుంబం - ఒక వ్యాపారి’ నినాదంతో స్వయం ఉపాధి అవకాశాలను విస్తరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), దీన్‌దయాళ్‌ జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కలిసి డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేస్తున్నారు. బ్యాంకుల ద్వారా లభించే రుణాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. మహిళలను ఎంఎస్‌ఎంఈలుగా రిజిస్ట్రేషన్ చేయించి చిన్న వ్యాపారాలు, యూనిట్ల కోసం సబ్సిడీతో రుణాలు ఇస్తున్నారు. ఉపాధి కోర్సుల్లో శిక్షణ కూడా అందిస్తున్నారు.

USA Program: హ్యూస్టన్ లో దిగ్విజయవంతంగా జరిగిన “14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”.. రెండు రోజులపాటు, 28 విభిన్న వేదికలలో.!

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన తృప్తి క్యాంటీన్లు డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఒక్కో క్యాంటీన్ ఏర్పాటుకు నలుగురు మహిళలు కలసి రూ.16.40 లక్షల పెట్టుబడి పెట్టాలి. నెలకు సుమారు రూ.6.39 లక్షల టర్నోవర్ వస్తూ, దాదాపు రూ.2.46 లక్షల లాభం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Magic drains: గ్రామాల్లో కొత్త ప్రయోగం.. మేజిక్ డ్రైన్లతో శుభ్రమైన వాతావరణం!

అంతేకాకుండా, అరకు కాఫీ కియోస్క్ మోడల్ స్టాల్స్, చాయ్‌రాస్తా ఏర్పాటుకు కూడా రుణాలు ఇస్తున్నారు. కాఫీ స్టాల్ కోసం రూ.2 లక్షలు, చాయ్‌రాస్తా కోసం రూ.8 లక్షల వరకు రుణం అందుబాటులో ఉంటుంది. సొంత స్థలం లేదా ప్రభుత్వ భూమి చూపిస్తే అనుమతులు ఇస్తారు.

AP liquor Case: జగన్ కి మరో షాక్.. ఎంపీల నుంచి ఐపీఎస్‌ల వరకు.. ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామాలు!

డ్వాక్రా మహిళలకు ర్యాపిడో భాగస్వామ్యంతో ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ప్రభుత్వం బైక్‌లు, స్కూటీలు కొనుగోలు చేసేందుకు రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు, ఆటోలు కొనుగోలు చేసేందుకు రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు రుణాలు ఇస్తోంది. అదనంగా, ఎగ్ కార్టులు (రూ.50,000 విలువైనవి), ఫుడ్ ప్రాసెస్ యూనిట్లకు రుణాలు కూడా మంజూరు చేస్తున్నారు.

Trains: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక..! పలు రైళ్లకు షెడ్యూల్‌ చేంజ్!

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వందలాది డ్వాక్రా మహిళలు ఈ పథకాల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆసక్తి గల మహిళలు మెప్మా, వెలుగు అధికారులు లేదా ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Ap Govt Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం!
AP Govt: కలెక్టరేట్ నిర్మాణం.. డిప్యూటీ స్పీకర్ కొత్త ప్రతిపాదన... ప్రజల సహకారంతో భవనం సాధ్యమేనా?
Phone pay: ఫోన్‌పే సంచలన బీమా పాలసీ..! రూ.181 ప్రీమియంతోనే హోమ్‌ ఇన్సూరెన్స్..!
Free electricity: ఉచిత కరెంట్ నిర్ణయంతో మండప నిర్వాహకుల్లో ఆనందం.. లోకేశ్!
YCP Shocking News: ఆ కేసులో జగన్‌కు షాక్.. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు! పిటిషన్ కొట్టివేత.. త్వరలో జైలుకు..?