టాలీవుడ్లో ఈ ఏడాది పెళ్లిళ్లు శుభవార్తల సీజన్ లా మారింది. ఒకవైపు కొందరు స్టార్ హీరోలు వివాహ బంధంలో అడుగుపెడుతుండగా ఇంకొందరు కొత్తగా తల్లిదండ్రులుగా మారుతున్నారు. ఇటీవల వరుణ్ తేజ్ తండ్రిగా మరిన్ని విషయం అందరికీ తెలిసిందే అదే విధంగా రామ్ చరణ్ కూడా రెండో బిడ్డకు తండ్రి కానున్నాడని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో మరో పేరు ఫిలింనగర్ లో చెక్కర్ల కొడుతుంది అది ఎవరో కాదండోయ్ మన భల్లాలదేవ రానా దగ్గుబాటి!
ఇండస్ట్రీలో లాంగ్‌టైం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరొందిన రానా కరోనా సమయంలో తన ప్రియురాలు మిహీకా బజాజ్‌తో సింపుల్‌గా వివాహం చేసుకున్నాడు. ఐదేళ్లుగా సంతోషంగా కలిసి జీవిస్తున్న ఈ జంట ఇప్పుడు తల్లిదండ్రులుగా మారబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సమాచారం ప్రకారం మిహీకా ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. దీంతో దగ్గుబాటి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. రామానాయుడు గారి మరణం తరువాత ఆ కుటుంబంలో ఇదే పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు. గతేడాది రానా తమ్ముడు అభిరామ్ దంపతులకు ఆడపిల్ల పుట్టగా ఇప్పుడు రానా–మిహీకా దంపతులు వారసుడి కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం.
రానా తండ్రి కాబోతున్నాడన్న వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దగ్గుబాటి వారసుడు రాబోతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే రానా మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.రానా ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్‌లతో పాటు హాలీవుడ్ ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉన్నాడు.