ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కీలకమైన జల ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో తెదేపా ఎంపీల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో కరువు నివారణ, గ్రామీణ జీవనోపాధి మెరుగుదల, నీటి భద్రత కోసం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను త్వరితగతిన ఆమోదించాలని ఎంపీలు కోరారు.
ఎంపీలు ప్రత్యేకంగా వరికపూడిశెల ప్రాజెక్ట్ విషయాన్ని ప్రస్తావిస్తూ, దానిని ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో చేర్చాలని, తద్వారా అవసరమైన నిధులు వెంటనే విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, రాష్ట్రంలోని పలు డ్యామ్‌ల మరమ్మతులు, భద్రతా చర్యల కోసం డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ (DRIP) కవరేజీని విస్తరించాలని కోరారు. దీంతో పంటల సాగు, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి పనులకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు.
ఈ సందర్భంగా ఎంపీలు కేంద్రంతో సమన్వయం సాధించడమే కాకుండా, రాష్ట్ర ప్రజల ఆవశ్యకతలకు అనుగుణంగా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరిగేలా దృష్టి సారించాలని మంత్రి పాటిల్‌ను కోరారు.